
భార్య కాపురానికి రాలేదని భర్త ఆత్మహత్య
పగిడ్యాల: భార్య కాపురానికి రావడంలేదనే మనస్తాపానికిలోనైన భర్త ఆత్మ హత్యకు పాల్పడిన ఘటన మండలంలోని పాతముచ్చుమర్రి గ్రామంలో బుధవారం చోటుచేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాలు.. గ్రామానికి చెందిన శాలుబాషా కుమారుడు నరేంద్ర(28)కు సి.బెళగల్‌కు చెందిన పవిత్రతో వివాహమైంది. వీరికి ఏడాది కుమార్తె ఉంది. భార్యా, భర్తల మధ్య కుటుంబ కలహాలు నెలకొనడంతో పవిత్ర కొంతకాలం క్రితమే పుట్టినింటికి వెళ్లింది. పలుమార్లు పెద్దమనషులతో పంచాయితీ చేసినా ఆమె రాకపోవడంతో తీవ్ర మనస్తాపానికిగురైన నరేంద్ర మంగళవారం రాత్రి అందరూ నిద్రిస్తుండగా ఇంట్లోనే ఉరివేసుకున్నాడు. గమనించిన కుటుంబ సభ్యులు వెంటనే చికిత్సనిమిత్తం నందికొట్కూరు ప్రభుత్వ వైద్యశాలకు తరలించగా అప్పటికే మృతిచెందినట్లు డాక్టర్లు నిర్ధారించారు. ముచ్చుమర్రి పోలీసులు కేసు నమోదు చేసి, మృతదేహానికి పోస్టుమార్టం నిర్వహించి బంధువులకు అప్పగించారు.