
ముగిసిన వీరభద్ర, కాళికాదేవిల బ్రహ్మోత్సవాలు
ఆస్పరి: మండలంలోని కై రుప్పలలో వెలసిన వీరభద్రస్వామి, కాళికాదేవిల బ్రహ్మోత్సవాలు ముగిశాయి. గత నెల 28న ప్రారంభమైన ఉత్సవాలు చివరి రోజు శనివారం వసంతోత్సవంతో పూర్తయ్యాయి. ఉత్సవాలలో వివిధ ప్రాంతాల నుంచి వచ్చిన భక్తులు స్వామి ని దర్శించుకుని మొక్కులు చెల్లించుకున్నారు. పూజా రి మల్లప్ప.. స్వామి వారికి గంగ, ఆకు పూజ, పంచామృతాభిషేకం, మంగళహారతులు నిర్వహించారు. అంతకుముందు తెల్లవారుజామున వీరభద్రస్వామి చెక్క గుర్రంపై ఊరేగుతున్నట్లుగా అలంకారం చేసి గ్రామంలో ఊరేగించారు. స్వాముల ఉత్సవ విగ్రహాలను పల్లకీలో మేళతాళాలతో ఊరేగించారు. భక్తులు నందికోలు ఆట ఆడారు. అనవాయితీగా స్వాములకు రంగులు వేసి వసంతోత్సవాన్ని ప్రారంభించారు. అనంతరం ఒకరిపై ఒకరు రంగులు వేసుకుంటూ ఆనందోత్సవాల మధ్య వేడుకలు ముగించారు.

ముగిసిన వీరభద్ర, కాళికాదేవిల బ్రహ్మోత్సవాలు