
సారూ.. న్యాయం చేయండి
ఎమ్మిగనూరురూరల్: పొలం తక్కువ ఉందని చూపారని.. సారూ.. మీరే న్యాయం చేయాలని బనవాసి కేవీకేకు వచ్చిన జిల్లా కలెక్టర్ రంజిత్‌బాషాకు పార్లపల్లి గ్రామానికి చెందిన రైతు చిన్నహనుమన్న అర్జీ ఇచ్చారు. తనకు 7.75 ఎకరాల భూమి ఉండగా రీ సర్వేలో 50 సెంట్లు తక్కువగా అధికారులు చూయిస్తున్నారని, తహసీల్దార్‌కు ఎన్ని సార్లు విన్నవించుకున్నా పట్టించుకోవటం లేదని కలెక్టర్‌కు ఫిర్యాదు చేశారు. తమ భూమి 50 సెంట్ల భూమి వేరే వారి పేరున ఆన్‌లైన్లో చూపుతోందని, సమస్యను పరిష్కరించాలని ఆర్జీని ఇచ్చారు. దానిని ఆదోని సబ్ కలెక్టర్ మౌర్యభరద్వాజ్‌కు అప్పగించి విచారించి న్యాయం చేస్తామని రైతుకు జిల్లా కలెక్టర్ హామీ ఇచ్చారు.