
కాలం తీరిన పదార్థాలతో విద్యార్థులకు భోజనం
కర్నూలు(హాస్పిటల్): కాలం తీరిన సరుకులతో పాఠశాలలో చదివే విద్యార్థులకు భోజనం వండి వడ్డిస్తున్నారు. తనిఖీల్లో ఈ విషయం తేలడంతో ఆహార నియంత్రణ విభాగం అసిస్టెంట్ ఫుడ్ కంట్రోలర్ కూర్మానాయకులు ఆదేశాల మేరకు ఫుడ్ సేఫ్టీ ఆఫీసర్ టి.రాజగోపాల్ నోటీసులు జారీ చేశారు. వెల్దుర్తిలోని ఎంజెపీఏపీడబ్ల్యుఆర్ స్కూల్‌లో గత జూన్‌లో ఆహార నియంత్రణ విభాగం ఫుడ్ సేఫ్టీ ఆఫీసర్ రాజగోపాల్ తనిఖీ చేశారు. ఆ సమయంలో అక్కడ లభించిన 56 ధనియాల పొడి ప్యాకెట్లు, ఆరు జబర్దస్త్ టీ పొడి ప్యాకెట్లు కాలం తీరినట్లు గుర్తించారు. వాటిని వండి పిల్లలకు వడ్డించారని తెలుసుకుని జాయింట్ కలెక్టర్ కోర్టులో కేసును ఫైల్ చేశారు. జేసీ ఆదేశాల మేరకు పాఠశాల ప్రిన్సిపల్ షబానాబేగంకు నోటీసులు జారీ చేశారు.
నోటీసులు జారీ చేసిన అధికారులు