బుగ్గన కుమారుడి వివాహ రిసెప్షన్‌కు హాజరైన వైఎస్‌జగన్‌ | - | Sakshi
Sakshi News home page

బుగ్గన కుమారుడి వివాహ రిసెప్షన్‌కు హాజరైన వైఎస్‌జగన్‌

Aug 7 2025 7:28 AM | Updated on Aug 8 2025 1:06 PM

వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్ది

ప్రజలకు నమస్కరిస్తున్న మాజీ సీఎం వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్ది

నూతన దంపతులు అర్జున్‌, అనన్యకు శుభాకాంక్షలు

భారీగా తరలివచ్చిన ప్రజలు, వైఎస్సార్‌సీపీ నేతలు, కార్యకర్తలు

జగన్‌ను చూడగానే ఈలలు, కేకలతో హోరెత్తిన రిసెప్షన్‌ వేదిక

జననేత, మాజీ సీఎం వైఎస్‌ జగన్‌మోహన్‌ రెడ్డిని చూసిన వెంటనే పెల్లుబుకిన ఆనందం.. కరచాలనం చేసేందుకు ఉరికిన ఉత్సాహం... ‘సీఎం.. సీఎం..జై జగన్‌’ అంటూ నింగిని అంటేలా నినాదం.. ఎటు చూసినా జనమే జనం.. ఉత్తేజం.. ఉల్లాసం.. బుధవారం డోన్‌ పట్టణంలో మాజీ ముఖ్యమంత్రి పర్యటన ఆద్యంతం అభిమాన సంద్రంగా సాగింది. ప్రతి చోటా జననేతపై ప్రజలంతా పూలు చల్లుతూ అభిమానం చాటుకున్నారు. ‘అమ్మఒడి పథకంతో మమ్మల్ని అందుకున్నారు ’ అంటూ మహిళలు చేతులెత్తి నమస్కరించారు. ‘మేమంతా సిద్ధం’ అనే జెండాలతో యువత కదం తొక్కారు. ‘వ్యవసాయాన్ని పండుగ చేశారు’ అంటూ కర్షకులు కదలి వచ్చారు. అడుగడుగునా ప్రజలు అభిమానాన్ని హోరెత్తించారు.

డోన్‌: ఆర్థిక శాఖ మాజీ మంత్రి బుగ్గన రాజేంద్రనాథరెడ్డి కుమారుడు బుగ్గన అర్జున్‌ వివాహ రిసెప్షన్‌ వేడుక బుధవారం అంగరంగ వైభవంగా జరిగింది. ముఖ్య అతిథిగా మాజీ ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి హాజరై నూతన వధూవరులు బుగ్గన అర్జున్‌ అమర్నాథరెడ్డి, అనన్యలకు పుష్ఫగుచ్ఛం అందజేసి ఆశీర్వదించారు. డోన్‌ శివారులోని దత్తాత్రేయ స్వామి ఆలయ సమీపంలో ప్రత్యేకంగా వేదిక ఏర్పాటు చేశారు. నూతన దంపతులకు వేదపండితులు వేదమంత్రాలతో ఆశీర్వదించారు. 

ఉదయం 11.30 గంటలకు వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి తాడేపల్లి నుంచి నేరుగా డోన్‌లో ఏర్పాటు చేసిన హెలిప్యాడ్‌కు చేరుకున్నారు. వైఎస్సార్‌ కాంగ్రెస్‌పార్టీ కర్నూలు జిల్లా అధ్యక్షుడు ఎస్వీ మోహన్‌రెడ్డితో పాటు వైఎస్సార్‌సీపీ నేతలు జగన్‌కు స్వాగతం పలికారు. హెలిప్యాడ్‌ వద్ద భారీగా జనం జగన్‌ కోసం వేచి ఉన్నారు. హెలికాప్టర్‌ రాగానే ‘జై జగన్‌న్‌’ నినాదాలతో ఆ ప్రాంతం హోరెత్తింది. అక్కడి నుంచి వివాహవేదిక వద్దకు జగన్‌ చేరుకున్నారు. జగన్‌ను చూడగానే అభిమానుల ఈలలు, కేకలు, ‘జై జగన్‌, సీఎం...సీఎం’ నినాదాలతో వేదిక ప్రాంగణం హోరెత్తింది. జగన్‌కు బుగ్గన రాజేంద్రనాథరెడ్డి ఆత్మీయంగా స్వాగతం పలికారు. 

ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన ర్యాంప్‌పై జగన్‌ వస్తున్నంత సేపు జనాభిమానంతో ప్రాంగణం హోరెత్తింది. అందరికీ జగన్‌ ఆప్యాయంగా అభివాదం చేస్తూ, నమస్కరిస్తూ కదిలాడు. చిరునవ్వులు చిందిస్తూ, కరచాలనం చేస్తూ వేదిక వద్దకు చేరుకున్నారు. నూతన దంపతులను ఆశీర్వదించి, నూతన దంపతుల తల్లిదండ్రులైన బుగ్గన దంపతులు, చల్లా సతీశ్‌రెడ్డి దంపతులు, సమీప బంధువులతో ఆప్యాయంగా మాట్లాడారు. ఫొటోలు దిగారు. ఆపై వేదికపై నుంచి అందరికీ అభివాదం చేసి నేరుగా హెలిప్యాడ్‌కు చేరుకుని తిరుగుపయనమయ్యారు. జగన్‌ రాకతో డోన్‌ మొత్తం జనాలతో కిక్కిరిసిపోయింది. 

వేదిక ఏర్పాటు చేసిన ఎన్‌హెచ్‌–44 సమీపంలో రోడ్డుకు ఇరువైపులా భారీగా జనం ఉన్నారు. జగన్‌ కాన్వాయ్‌ వెళ్తుంటే జైజగన్‌ అంటూ హోరెత్తించారు. కారులో నుంచి జగన్‌ అభిమానులు, కార్యకర్తలకు అభివాదం చేశారు. వేడుకకు ఎమ్మెల్యేలు బాలనాగిరెడ్డి, విరూపాక్షి, ఎమ్మెల్సీలు ఇసాక్‌ బాషా, మధుసూదన్‌, కల్పలతారెడ్డి, జెడ్పీ చైర్మన్‌ పాపిరెడ్డి, మాజీ ఎమ్మెల్యేలు శిల్పా చక్రపాణిరెడ్డి, శిల్పా రవిచంద్రకిషోర్‌ రెడ్డి, గంగుల బిజేంద్రనాథ్‌రెడ్డి, సాయిప్రసాద్‌రెడ్డి, కాటసాని రామిరెడ్డి, కంగాటి శ్రీదేవి, మాజీ ఎంపీలు బుట్టా రేణుక, పోచా బ్రహ్మానందరెడ్డి, తలారి రంగయ్య, పార్టీ నేతలు ఆదిమూలపు సతీష్‌, దారా సుధీర్‌, కోట్ల హర్షతో పాటు నంద్యాల, కర్నూలుతో పాటు పలు జిల్లాల నుంచి వైఎస్సార్‌సీపీ నేతలు, కార్యకర్తలు హాజరయ్యారు.

ప్రత్యేక ఆకర్షణగా బుగ్గన ఇంటి సెట్‌

రిసెప్షన్‌ కోసం వేదికపై ప్రత్యేకంగా సెట్‌ ఏర్పాటు చేశారు. బుగ్గన సొంతూరు బేతంచెర్లలో వారి పూర్వీకులు 1923లో ఇంటిని నిర్మించారు. ఇప్పటికీ అదే ఇంట్లో బుగ్గన నివాసం ఉంటున్నారు. వేదికపై తన ఇంటి నమూనాతో సెట్‌ వేయించారు. అచ్చం బుగ్గన నివాసం ఎలా ఉందో అలాగే సెట్‌ ఉండటంతో వేడుకకు హాజరైన వారు ప్రత్యేకంగా తిలకించారు. ఇంటి ముందే రిసెప్షన్‌ జరిగిన భావన కల్పించారు.

డోన్‌ పట్టణంలో జనసంద్రం1
1/3

డోన్‌ పట్టణంలో జనసంద్రం

ఆత్మీయ అభివాదం2
2/3

ఆత్మీయ అభివాదం

జనసంద్రం3
3/3

జనసంద్రం: డోన్‌ పట్టణంలోని ఫ్లై ఓవర్‌ బ్రిడ్జి ఎక్కి వైఎస్‌ జగన్‌ను స్తున్న ప్రజలు

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement