
వానాకాలంలోనూ ఎండుతున్న గొంతులు!
వానాకాలంలోనూ ప్రజలు దాహార్తితో అల్లాడుతున్నారు. బిందె నీటి కోసం కిలోమీటర్ల దూరం వెళ్లాల్సి వస్తోంది. కోడుమూరు మండలం కొత్తపల్లెలో ఈ దుస్థితి నెలకొంది. గ్రామంలో 500 మంది నివాసం ఉంటున్నారు. గత రెండు వారాల నుంచి రెండు బోర్లు మరమ్మతులకు గురై నీరు రావడం లేదు. దీంతో గ్రామస్తులు కిలోమీటర్ దూరాన ఉన్న వ్యవసాయ బోర్లు, బావులు, జీడీపీ కాల్వను ఆశ్రయించి తాగునీటికి తెచ్చుకుంటున్నారు. ‘కుళాయిలకు నీరు రాక, 70 ఏళ్ల వయస్సులో కిలోమీటర్ దూరాన ఉన్న వ్యవసాయ బావికి వెళ్లలేక ఇబ్బంది పడుతున్నా’ అని గ్రామానికి చెందిన కుమ్మరి గిడ్డయ్య ఆవేదన వ్యక్తం చేశాడు. అధికారులు స్పందించాలని కోరాడు. – కోడుమూరు రూరల్

వానాకాలంలోనూ ఎండుతున్న గొంతులు!

వానాకాలంలోనూ ఎండుతున్న గొంతులు!

వానాకాలంలోనూ ఎండుతున్న గొంతులు!