
గువ్వలకుంట్లను సందర్శించిన వైద్య బృందం
కొత్తపల్లి: విష జ్వరాలతో మంచం పట్టిన గువ్వలకుంట్ల గ్రామం ఎస్సీ కాలనీని గురువారం వ్యాధుల నిర్మూలన రీసెర్చ్ బృందం సందర్శించింది. బృందం సభ్యులు కాలనీలో మురికి కుంటలు, నీరు నిల్వ ఉన్న ప్రదేశాలు, కాలనీ నీటి సరఫరా చేసే బావులను, ఇళ్లలోని నీటి తొట్టిలు, డ్రమ్ములు, ఇంటి పరిసరాలను పరిశీలించారు. ఈ సందర్భంగా జిల్లా మైక్రో బయాలజీ వైద్యులు సచిన్ సుమంత్ మాట్లాడుతూ.. విష జ్వరాలకు కారణాలు తెలుసుకునేందుకు ముందుగా జ్వర బాధితుల నుంచి రక్త సేకరణ చేశామన్నారు. వీటిని వ్యాధి నిర్ధారణ పంపిస్తామన్నారు. గ్రామస్తులు ఇంటి పరిసరాలను శ్రుభంగా ఉంచుకోవాలన్నారు. ఆయన వెంట జనరల్ ఫిజీషియన్ శంకర్ నరేన్, కమ్యూనిటీ మెడిసిన్ డాక్టర్ జాహ్నవి, డిస్ట్రిక్ట్ ఎపిడమాలజిస్ట్ రమేష్, కొత్తపల్లె వైద్యాధికారులు దీపా నాగవేణి, మహమ్మద్ బేగ్, వైద్య, ఆరోగ్య సిబ్బంది, ఆశా వర్కర్లు ఉన్నారు.