
ఆటోలో 60 లీటర్ల సారా పట్టివేత
కర్నూలు: ఆటోలో భారీగా సారా తరలిస్తున్నట్లు సమాచారం అందడంతో కర్నూలు ఎకై ్సజ్ సీఐ చంద్రహాస్, ఎస్‌ఐ నవీన్ బాబు ఆధ్వర్యంలో గురువారం తనిఖీలు నిర్వహించి మూడు సంచుల్లో 600 ప్యాకెట్లు (60 లీటర్లు) నాటు సారాను స్వాధీనం చేసుకున్నారు. కొల్లంపల్లి తాండాకు చెందిన జటావత్ లక్ష్మీబాయి, పెద్దకొట్టాల గ్రామానికి చెందిన మహబూబ్ బాషా ఆటోలో సారా తరలించి లక్ష్మీపురం గ్రామంలోని సందెపోగు కనక సూర్యం ఇంటి ముందు దింపుతుండగా ఎకై ్సజ్ పోలీసులు కాపు కాసి ముగ్గురిని అదుపులోకి తీసుకున్నారు. ఆటోతో పాటు సారాను సీజ్ చేసి స్టేషన్‌కు తరలించారు. నిందితులపై కేసు నమోదు చేసి రిమాండ్‌కు పంపినట్లు సీఐ చంద్రహాస్ తెలిపారు. ఈ తనిఖీల్లో ఎకై ్సజ్ సిబ్బంది ఈరన్న, మధు, వెంకటేశ్వర్లు, సూర్యనారాయణ, రాజు, చంద్రపాల్ తదితరులు పాల్గొన్నారు. అలాగే బంగారుపేటలోని నాటుసారా స్థావరాలపై ఈఎస్‌టీఎఫ్, కర్నూలు టూటౌన్ పోలీసులతో కలసి ఎకై ్సజ్ అధికారులు దాడులు నిర్వహించి సారా బట్టీలను ధ్వంసం చేశారు.