
పంచాయతీ కార్యదర్శుల సంఘం నూతన కార్యవర్గం ఎన్నిక
కర్నూలు(అర్బన్): ఆంధ్రప్రదేశ్ పంచాయతీ కార్యదర్శుల సంఘం కర్నూలు జిల్లా యూనిట్ నూతన కార్యవర్గాన్ని శనివారం స్థానిక ఎంపీపీ హాల్‌లో జరిగిన సమవేశంలో ఎన్నుకున్నారు. కార్యక్రమాని కి సంఘం రాష్ట్ర అసోసియేట్ ప్రెసిడెంట్ వై.హేమంత్‌కుమార్‌రెడ్డి హాజరై నూతన కార్యవర్గాన్ని అభినందించి పంచాయతీ కార్యదర్శుల సమస్యలపై చర్చించారు. సంఘం సభ్యులు జిల్లాలోని పంచాయతీ కార్యదర్శులకు అందుబాటులో ఉంటూ వారి సమస్యలను పరిష్కారానికి కృషి చేయాలని కోరారు.
నూతన కార్యవర్గం
అధ్యక్షులుగా పి.జగన్నాథం, ప్రధాన కార్యదర్శిగా ఎన్.శ్రీధరమూర్తి, అసోసియేట్ ప్రెసిడెంట్‌గా పీఎస్‌జే సిద్దు, కోశాధికారిగా కె.సురేష్, ఉపాధ్యక్షులుగా బి.సుధాకర్‌రెడ్డి,జి.లక్ష్మన్న, టి.రవికుమార్,సంయు క్త కార్యదర్శులుగా బి.శ్రీనివాసులు, బి.మహేష్, ఎం.హుసేన్‌సాహెబ్, ఆర్గనైజింగ్ కార్యదర్శులుగా సి. అంకాలప్పనాయుడు, ఎం.రియాజ్‌బాషా, బి.బలరామ్, ప్రచార కార్యదర్శులుగా ఎం.సైఫుల్లాబేగ్, కె.సుంకన్న, జి.రాజ్‌కమల్, డివిజినల్ కార్యదర్శులుగా ఎల్.సురేష్‌కుమార్, ఎం.మధు, పి.వెంకటేశ్వర్లు, ఈసీ మెంబర్లుగా బి.జనార్దన్, ఎం.రాఘవేంధ్ర, కె.అయ్యన్న ఎన్నికయ్యారు.