
మాజీ ఆర్మీ అధికారి అరెస్టు
● 53 లిక్కర్ బాటిళ్లు స్వాధీనం
కర్నూలు: దిన్నెదేవరపాడు గ్రామ శివారులోని తిరుమల గిరి టౌన్‌షిప్‌లో నివాసముంటున్న మాజీ ఆర్మీ అధికారి (బీఎస్‌ఎఫ్) నగేష్ రావు ఇంట్లో డిఫెన్స్ మద్యం బాటిళ్లు పట్టుబడ్డాయి. ఈయన ఏడా ది కాలంగా బెంగళూరు నుంచి మిలిటరీ క్యాంటీన్‌లో ఇచ్చే మద్యం తీసుకొచ్చి వ్యాపారం సాగిస్తున్నట్లు సమాచారం అందడంతో ఎకై ్సజ్ జిల్లా అధికారి సుధీర్ బాబు ఆదేశా ల మేరకు సీఐలు చంద్రహాస్, రాజేంద్రప్రసాద్ బృందాలుగా ఏర్పడి ఇంట్లో సోదా లు నిర్వహించగా 53 మద్యం బాటిళ్లు బయటపడ్డాయి. ఇవి ఆర్మ్‌డ్ పారా మెడికల్ ఫోర్సెస్‌లో పనిచేసే అధికారులు, సిబ్బందికి మాత్రమే సరఫరా చేస్తారు. అయితే నగేష్ రావు వ్యాపారం నిమిత్తం మిలిటరీ క్యాంటీన్‌లో కొనుగోలు చేసి రెట్టింపు ధరలకు విక్రయాలు జరుపుతున్నట్లు దర్యాప్తులో తేలింది. దీంతో మద్యం బాటిళ్లు సీజ్ చేసి ఆయనపై కేసు నమోదు చేసి రిమాండ్‌కు పంపినట్లు అధికారులు తెలిపారు. తనిఖీల్లో ఎకై ్సజ్ ఎస్‌ఐలు రెహనా బేగం, ఇంద్రకిరణ్, తేజ, సిబ్బంది రామలింగ, చంద్రపాల్, మధుకిషోర్, రాణి, బషీర్, లాలప్ప తదితరులు పాల్గొన్నారు.