
విస్తృతంగా పోలీసు తనిఖీలు
కర్నూలు: రోడ్డు భద్రతపై ప్రజలకు అవగాహన కల్పించేందుకు పోలీసులు జిల్లా అంతటా వా హన తనిఖీ కార్యక్రమాలు నిర్వహించారు. రహ దారి ప్రమాదాల నియంత్రణే లక్ష్యంగా ప్రతి శనివారం వాహన తనిఖీలు నిర్వహించాలన్న ఉన్నతాధికారుల ఆదేశాల మేరకు పోలీస్ స్టేషన్ల వారీగా వాహన తనిఖీలు నిర్వహించారు. రోడ్డు భద్రత, ట్రాఫిక్ నిబంధనలపై సమావేశాలు నిర్వహించి అవగాహన కల్పించారు. మైనర్లు వాహనా లు నడపకుండా తల్లిదండ్రులు జాగ్రత్తలు పాటించాలని, బైకులు నడిపేవారు కచ్చితంగా హెల్మె ట్లు ధరించాలని సూచించారు. ఓవర్ లోడ్‌తో వెళ్తున్న వాహనాలను ఆపి కౌన్సెలింగ్ ఇచ్చారు. మద్యం సేవించి వాహనాలు నడుపుతూ తనిఖీల్లో పట్టుబడిన వారికి రోడ్డు భద్రత ప్రాముఖ్యత గురించి వివరించి కేసులు నమోదు చేశారు.
అనారోగ్యంతో
విద్యార్థిని మృతి
హొళగుంద: అనారోగ్య ంతో మండల కేంద్రానికి చెందిన కుమ్మరి రూప (13) అనే విద్యార్థిని శుక్రవారం రాత్రి మృతి చెందారు. ఎల్లార్తి ప్రభు త్వ పాఠశాలలో ఉపాధ్యాయుడిగా పనిచేస్తున్న కుమ్మరి శరణప్ప, విశాలాక్షి దంపతులకు ఇద్దరు కుమారులతో పాటు రూప కూతురు. గ్రామానికి సమీపంలోని మాటసుగురు గ్రామం వద్ద ప్రైవేటు పాఠశాలలో 8వ తరగతి చదువుతున్నారు. రూప గత 8 నెలలుగా అనారోగ్యంతో బాధ పడుతూ మృతి చెందారు. ఇదిలా ఉండగా హొళగుంద గ్రామంలో శనివారం ఒక్క రోజే వివిధ కారణాలతో నలుగురు మృతి చెందారు. వృద్యాప్యం, అనారోగ్యం, ప్రమాదాలతో వారం వ్యవధిలో 20 మంది మృతి చెందడంతో గ్రామస్తులు తీవ్ర ఆందోళన చెందుతున్నారు.
రోడ్డు ప్రమాదంలో
వ్యక్తి దుర్మరణం
డోన్ టౌన్: డోన్ – అబ్బిరెడ్డిపల్లెకి రహదారిలో పెద్దవంక వద్ద శనివారం జరిగిన రోడ్డు ప్రమాదంలో ఓ వ్యక్తి దుర్మరణం చెందాడు. సీసంగుంతల గ్రామానికి చెందిన మృతుడు నూర్‌బాషా (49) (అలియాస్ ఎర్రబాషా ఉరఫ్ వలి) లారీ డ్రైవర్‌గా పని చేస్తూ కొన్నేళ్లుగా పట్టణంలోని ఇందిరానగర్‌లో నివాసం ఉన్నాడు. శనివారం బైకు మీద అబ్బిరెడ్డిపల్లె వైపు వెళ్తుండగా.. అదే సమయంలో కృష్ణగిరి మండలం కంభాలపాడు గ్రామానికి చెందిన భాస్కర్‌రెడ్డి అనే వ్యకి త్వరలో జరగబోయే కూతురు పెళ్లి పత్రికలు పంచేందుకు బైకుపై వస్తుండగా పెద్దవంక వద్ద రెండు బైక్‌లు ఎదురెదురుగా ఢీకొన్నాయి. ఈ ప్రమాదంలో గాయపడిన ఇద్దరిని చికిత్సల నిమిత్తం ఆసుపత్రికి తరలించగా నూర్‌బాషా తలకు తీవ్రమైన గాయాలు కావడంతో చికిత్స పొందుతూ కోలుకోలేక మృతి చెందాడు. భాస్కర్‌రెడ్డిని మెరుగైన వైద్యం కోసం కర్నూలుకు తరలించారు. మృతుడు నూర్‌బాషాకు భార్య, నలుగురు కుమార్తెలు, ఒక కుమారుడు ఉన్నారు. రూరల్ పోలీసులు కేసు నమోదు చేశారు.

విస్తృతంగా పోలీసు తనిఖీలు

విస్తృతంగా పోలీసు తనిఖీలు