
బుజ్జి పిట్ట.. చిట్టి గూళ్లు!
పిట్ట కొంచెం కూత ఘనమే కాదు.. గూడు కట్టడంలో ఎవరైనా తన తర్వాతనే అని చెప్పవచ్చు. తన పొదరిల్లు నిర్మాణంలో ఎన్ని జాగ్రత్తలు తీసుకుంటుందో తెలుసుకుంటే ఆశ్చర్యపోవాల్సిందే. ఇతర జీవాల నుంచి రక్షణగా చిటారు కొమ్మన గూడు కట్టుకుంటోంది. తేలికపాటి గడ్డి పోచలతో మెత్తని పాన్పు వల్లె అల్లుకుంటుంది. కళాత్మకమైన గిజిగాడు గూళ్లను చూస్తే ఎవరైనా మెచ్చుకోవాల్సిందే. గార్గేయపురం సమీపంలోని ఓ వ్యవసాయ బావి గట్టుపై ఉన్న చెట్టు కొమ్మలకు బుజ్జి పిట్టలు చిట్టి గూళ్లను ఏర్పాటు చేసుకుని నివాసముంటున్నాయి.
– కర్నూలు(రూరల్)