
స్థల విషయంలో ఘర్షణ.. ఒకరి మృతి
ఆదోని అర్బన్: స్థల విషయంలో ఘర్షణ జరిగి ఒక వ్యక్తి మృతిచెందాడు. ఈ ఘటన ఆదివారం చోటు చేసుకుంది. ఆదోని త్రీటౌన్ సీఐ రామలింగమయ్య తెలిపిన వివరాల మేరకు.. అరుంజ్యోతినగర్‌లో గిరి బాబు, వీరేష్ కుటుంబాలు పక్కపక్కనే ఉంటున్నా యి. ఇద్దరు కుటుంబాల మధ్య గతంలో స్థల వివా దం ఉంది. గిరిబాబు ఇంటిపై నుంచి నీటిని కిందకు తోడేస్తుండగా వీరేష్ కుటుంబ సభ్యులు అభ్యంతరం చెప్పారు. దీంతో వాగ్వాదం జరిగి ఇరువర్గాల మధ్య ఘర్షణ చోటు చేసుకుంది. ఘర్షణలో గిరిబాబు బాబాయ్ లక్ష్మన్నకు గాయాలయ్యాయి. ఆదోని ప్రభుత్వ ఏరియా ఆసుపత్రికి తరలించగా పరిస్థితి విషమంగా ఉందని వైద్యులు చెప్పారు. కర్నూలుకు తీసుకెళ్తుండగా మార్గమధ్యలో ఎమ్మిగనూరు సమీపంలో లక్ష్మన్న మృతిచెందాడు. దీంతో లక్ష్మన్న కుటుంబ సభ్యులు ఆదోని త్రీటౌన్ పోలీస్‌స్టేషన్ ఎదుట ఆందోళన చేపట్టారు. సీఐలు రామ లింగమయ్య, శ్రీరామ్ మృతుడి బంధువులకు నచ్చజెప్పడంతో ఆందోళన విరమించారు. వ్యవసాయం చేసే లక్ష్మన్నకు ఇద్దరు కుమారులు, ముగ్గురు కుమార్తెలు ఉన్నారు. మృతుడి భార్య ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్లు సీఐ రామలింగమయ్య తెలిపారు.
పోలీస్‌స్టేషన్ ఎదుట మృతుడి కుటుంబ
సభ్యుల ఆందోళన

స్థల విషయంలో ఘర్షణ.. ఒకరి మృతి