‘కూటమి’ చేస్తున్న అప్పులను గమనించాలి | - | Sakshi
Sakshi News home page

‘కూటమి’ చేస్తున్న అప్పులను గమనించాలి

Aug 11 2025 6:56 AM | Updated on Aug 11 2025 6:56 AM

‘కూటమి’ చేస్తున్న అప్పులను గమనించాలి

‘కూటమి’ చేస్తున్న అప్పులను గమనించాలి

పాణ్యం: రాష్ట్రంలోని కూటమి ప్రభుత్వం చేస్తున్న అప్పులను, దోపిడీని ప్రపంచ దేశాల్లో ఉన్న ప్రవాసాంధ్రులు గమనించాలని నంద్యాల జిల్లా వైఎస్సార్‌సీపీ అధ్యక్షుడు కాటసాని రాంభూపాల్‌రెడ్డి అన్నారు. అమెరికా పర్యటనలో ఉన్న ఆయనకు అక్కడున్న ప్రవాసాంధ్రులు ఘనస్వాగతం పలికారు. అనంతరం డల్లాస్‌లో ఏర్పాటు చేసిన ప్రవాసాంధ్ర ప్రతినిధుల ఆత్మీయ సమావేశానికి ముఖ్యఅతిథులుగా కాటసాని రాంభూపాల్‌రెడ్డితో పాటు ఆయన కుమారుడు కాటసాని శివనరసింహారెడ్డి హాజరైయ్యారు. ఈ సందర్భంగా కాటసాని మాట్లాడుతూ.. జగనన్న పాలన అంటే ప్రజలకు నమ్మకమన్నారు. జగనన్న పాలనలో 15,004 గ్రామ, వార్డు సచివాయాలు ఏర్పాటయ్యాయని, 2.6 లక్షల మంది వలంటర్లీ సేవలు అందించారని, స్పందన కార్యక్రమంతో లక్షల సమస్యలు పరిష్కారం అయ్యాయన్నారు. కొత్తగా 17 మెడికల్‌ కళాశాలు, ఫ్యామిలీ డాక్టర్‌ వ్యవస్థ, ఆరోగ్యశ్రీలోకి 3 వేలలకు పైగా చికిత్స చేరి సామాన్యులకు ఆరోగ్య భరోసా కలిగిందన్నారు. పదివేలకు పైగా వైఎస్సార్‌ఆరోగ్య క్లినిక్‌లు తీసుకొచ్చారన్నారు. నాడు–నేడు పథకం ద్వారా 50వేల పైగా పాఠశాలలను ఆధునికీకరణ చేశారన్నారు. మొత్తం 6.16 లక్షల ప్రభుత్వ ఉద్యోగాలు, 28.89లక్షల ప్రయివేట్‌ ఉద్యోగాలు కల్పించారన్నారు. సీఎస్‌డీపీ వృద్ధిరేటు 11.43శాతంగా దేశంలో మొదటి స్థానంలో నిలించిందన్నారు. జగనన్న పాలనలో కాగ్‌ నివేదిక కేంద్ర గణాంకాలు ఉన్నాయన్నారు. టీడీపీ, జనసేన, కూటమి తప్పుడు హామీలతో ప్రజలను మోసం చేశాయని, సోషల్‌ మీడియా పోస్టులతో ప్రజలకు నిజం చెప్పాలన్నారు. జగనన్న నాయకత్వం ఎలా ఉంటుందో ప్రపంచానికి తెలియాలన్నారు. నిజం మాట్లాడే గొంతులుగా ఎన్‌ఆర్‌ఐలు ముందుకు రావాలన్నారు.

అమెరికా డల్లాస్‌లో

కాటసాని ఆత్మీయ సమావేశం

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement