
వైఎస్సార్‌సీపీలో మహిళలకు సముచిత గౌరవం
కర్నూలు (టౌన్): వైఎస్సార్‌సీపీలో మహిళలకు సముచిత గౌరవం ఉందని ఆ పార్టీ మహిళా విభాగం రాష్ట్ర వర్కింగ్ ప్రెసిండెంట్ ఎస్వీ విజయ మనోహరి అన్నారు. పార్టీలో మహిళా విభాగాన్ని మరింత బలోపేతం చేద్దామని పిలుపునిచ్చారు. కర్నూలులో ఎస్వీ విజయ మనోహరిని మహిళలు ఆదివారం ఘనంగా సత్కరించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. టీడీపీ అధినేత చంద్రబాబు ఎన్నికల సమయంలో మహిళలకు ఎన్నో హామీలు ఇచ్చి మోసం చేశారన్నారు. ఏడాది దాటినా మహిళలకు ఇచ్చిన ఏ ఒక్క హామీ నేరవేర్చలేదన్నారు. వైఎస్సార్‌సీపీ బీసీ మహిళా విభాగం కార్యదర్శి భారతి, జిల్లా మహిళా విభాగం అధ్యక్షులు సు మలత, నగర అధ్యక్షులు మంగమ్మ, నగర అంగన్‌వాడీ అసోసియేషన్ అధ్యక్షులు రాధి కమ్మ, స్వర్ణలత, మహేశ్వరీ, సుగుణ పాల్గొన్నారు.
17 మండలాల్లో వర్షం
కర్నూలు(అగ్రికల్చర్): జిల్లాలో శనివారం ఉదయం నుంచి ఆదివారం ఉదయం వరకు 17 మండలాల్లో వర్షం కురిసింది. కౌతాళంలో 24.2, దేవనకొండలో 19.8, పెద్దకడుబూరులో 14.8, ఆదోనిలో 13.6, హొళగుందలో 13.2, పత్తికొండలో 12.8, కోసిగిలో 12.6, సి.బెళగల్‌లో 9.2 మి.మీ. వర్షపాతం నమోదైంది. ఖరీఫ్ సాధారణ విస్తీర్ణం 4.22 లక్షల హెక్టార్లు ఉండగా ఇప్పటి వరకు 3.02 లక్షల హెక్టార్లలో పంటలు సాగయ్యాయి.
కాంట్రాక్ట్ ఉద్యోగులను రెగ్యులర్ చేయాలి
కర్నూలు(సెంట్రల్): ఎన్నికల సమయంలో టీడీపీ అధినేత చంద్రబాబు ఇచ్చిన హామీ మేరకు కాంట్రాక్ట్, అవుట్‌సోర్సింగ్ ఉద్యోగులను వెంటనే రెగ్యులర్ చేయాలని కాంట్రాక్ట్, అవుట్‌సోర్సింగ్ ఎంప్లాయీస్ అసోసియేషన్ ఉమ్మడి రాష్ట్ర అధ్యక్ష, కార్యదర్శులు కె.సుమన్, ఈ.మధుబాబు కోరారు. కర్నూలులోని రెవెన్యూ భవన్‌లో ఆదివారం నిర్వహించిన సమావేశంలో వారు మాట్లాడారు. కాంట్రాక్ట్, అవుట్‌సోర్సింగ్ ఉద్యోగులకు నెలనెలా జీతాలు సక్రమంగా పడడంలేదన్నారు. హెచ్‌ఆర్ పాలసీని అమలు చేయాలని, సీనియారిటీ ప్రతిపాదికన సర్వీసు రూల్స్‌ను వర్తింపజేయాలి కోరారు. ఏపీ జేఏసీ అమరావతి కర్నూలు జిల్లా చైర్మన్ వై.కృష్ణ , ఆర్గనైజింగ్ సెక్రటరీ పి.రామ్‌భద్ర, సెక్రరటీ చారి,నాయకులు ఎం.నాగరాజు, ఎం.అమిదాబి, శ్రీధర్, సంధ్య, సరస్వతి, సోమన్న, సరోజ, సావత్రి, యశోద పాల్గొన్నారు.
మల్లన్న దర్శనానికి పోటెత్తిన భక్తులు
శ్రీశైలం టెంపుల్: శ్రీశైలంలో వెలసిన శ్రీ భ్రమరాంబా మల్లికార్జున స్వామి అమ్మవార్ల దర్శనానికి భక్తులు పోటెత్తారు. ఆదివారం ఉభయ తెలుగు రాష్ట్రాల నుంచే కాకుండా ఇతర రా ష్ట్రాల నుంచి వేలాది మంది భక్తులు శ్రీగిరి చేరుకుని స్వామి అమ్మవార్లను దర్శించుకున్నారు. భక్తుల రద్దీతో క్షేత్ర పురవీధులు కిక్కిరిసి కనిపించాయి.

వైఎస్సార్‌సీపీలో మహిళలకు సముచిత గౌరవం