
జెండా.. గుండెల నిండా!
● 1.1 కిలోమీటర్ల పొడవు జాతీయ జెండా ప్రదర్శన
కర్నూలు(సెంట్రల్): ఆజాదీకి అమృత్ మహోత్సవంలో భాగంగా స్వాతంత్య్ర దినోత్సవాన్ని పురస్కరించుకొని కర్నూలులో 1.1 కిలోమీటర్ల జాతీయ జెండాను విద్యార్థులు, యువతీ, యువకులు ప్రదర్శించారు. సుంకేసుల రోడ్డులో ఉన్న సెయింట్ జోసెఫ్ కళాశాల నుంచి కొండారెడ్డి బురుజు వరకు దాదాపు 2,800 మంది విద్యార్థులు మువ్వన్నెల తిరంగా ప్రదర్శించగా కలెక్టర్ పి.రంజిత్‌బాషా వీక్షించారు. గ్లోబల్ టౌన్‌షిప్ మేనేజింగ్ డైరక్టర్ ఖాజా మాలిక్, సెయింట్ జోసెఫ్ కళాశాల విద్యార్థులు, ఐ అముజయ యునైటెడ్ యంగ్ స్టార్ అసోసియేషన్ యూత్ బిగ్రేడు–2025 సహకారంతో 1.1 కిలోమీటర్ల పొడవు జాతీ య జెండాను రూపొందించారు. ఈ సందర్భంగా కలెక్టర్ పి.రంజిత్‌బాషా మాట్లాడుతూ ఇలాంటి మువ్వన్నెల జెండాల ప్రదర్శన ద్వారా ప్రజల్లో జాతీయ సమైక్యత భావాలు కలుగుతాయని, ఆగస్టు 15వ తేదీ వరకు హర్ ఘర్ తిరంగా కార్యక్రమంలో భాగంగా ప్రతి ఒక్కరూ తమ ఇళ్లపై జాతీయ జెండాను ఎగురవేయాలని సూచించారు. కాగా, ఈ కార్యక్రమాన్ని వరల్డ్ రికార్డ్స్ ఆఫ్ ఇండియా ప్రతినిధులు వచ్చి రికార్డు చేశారు. కార్యక్రమంలో డీఈఓ శామ్యూల్‌పాల్, గ్లోబల్ టౌన్‌షిప్ ఎండీ పవన్ సోలంకి, సెయింట్ జోసెప్ కళాశాలకు చెందిన డీన్ శౌరీలు రెడ్డి, ప్రిన్సిపాల్ శాంత పాల్గొన్నారు.