దాహం తీర్చుకోవడానికి వెళ్లి మృత్యుఒడికి.. | - | Sakshi
Sakshi News home page

దాహం తీర్చుకోవడానికి వెళ్లి మృత్యుఒడికి..

Jun 25 2024 1:34 AM | Updated on Jun 25 2024 1:34 AM

దాహం తీర్చుకోవడానికి వెళ్లి మృత్యుఒడికి..

దాహం తీర్చుకోవడానికి వెళ్లి మృత్యుఒడికి..

విద్యుదాఘాతంతో యువకుడు మృతి ● వడ్డెకొత్తపల్లిలో ఘటన

పెద్దవంగర: గొర్రెలు మోపుతున్న క్రమంలో దాహం వేయడంతో తీర్చుకునేందుకు వెళ్లిన ఓ యువకుడు మృత్యుఒడికి చేరుకున్నాడు. విద్యుదా ఘాతంతో అక్కడికక్కడే మృతి చెందాడు. ఈ ఘటన మహబూబాబాద్‌ జిల్లా పెద్దవంగర మండలం వడ్డెకొత్తపల్లిలో జరిగింది. ఎస్సై మహేశ్‌ కథనం ప్రకారం.. గ్రామానికి చెందిన కొమ్మనబోయిన రాజు (26) వ్యవసాయం, గొర్రెలకాపరిగా పని చేస్తూ కుటుంబాన్ని పోషించుకుంటున్నాడు. రోజు మాదిరిగానే గొర్రెలు మోపేందుకు సోమవారం మధ్యాహ్నం తన పొలం వద్దకు వెళ్లాడు. ఎండ తీవ్రంగా ఉండడంతో దాహం తీర్చుకునేందుకు వ్యవసాయ బోరు వద్దకు వెళ్లాడు. అక్కడ నీరు తాగే క్రమంలో బోరు ఇనుప పైపుకు విద్యుత్‌ తీగలు తగిలి ఉండడం గమనించలేదు. దీంతో విద్యుత్‌షాక్‌కు గురై అక్కడికక్కడే మృతి చెందాడు. స్థానికులు 108 అంబులెన్స్‌కు సమాచారం అందించగా వారు హుటాహుటిన ఘటనాస్థలికి చేరుకుని రాజును పరిశీలించి మృతి చెందినట్లు నిర్ధారించారు. మృతుడికి భార్య రవళి, 11 నెలల కుమారుడు రియాన్స్‌ ఉన్నాడు. భార్య రవళి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై తెలిపారు.

Advertisement
 
Advertisement
Advertisement