రక్తహీనతపై అవగాహన కల్పించాలి
● డీఎంహెచ్‌ఓ మురళీధర్
మహబూబాబాద్: రక్తహీనతపై అవగాహన కల్పించడంతో పాటు సమస్య రాకుండా చూడాలని డీఎంహెచ్‌ఓ మురళీధర్ అన్నారు. ఇన్‌స్టిట్యూట్ ఫర్ గ్లోబల్ డెవలప్‌మెంట్ సంస్థ ఆధ్వర్యంలో శుక్రవారం స్థానిక లయన్స్ క్లబ్ భవనంలో అంగన్‌వాడీ టీచర్లు, సంబంధిత సిబ్బందికి రక్తహీనతపై శిక్షణ తరగతులు నిర్వహించారు. ఈ సందర్భంగా మురళీధర్ మాట్లాడుతూ.. రక్తహీనత రాకుండా ప్రతీ ఒక్కరు పాటుపడాలన్నారు. అయోడిన్ లోపం వల్ల కలిగే రుగ్మతలను వివరించాలన్నారు. అనంతరం శిక్షణ పొందిర వారికి సర్టిఫికెట్లు అందజేశారు. కార్యక్రమంలో డాక్టర్ దయాకర్, ఐజీడీ కోఆర్టినేటర్ ప్రభాకర్, కవిత, క్రాంతికుమార్, సునీత, సరస్వతి, మంగీలాల్ తదితరులు పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment