మహబూబాబాద్ రూరల్: విద్యార్థులు వందశాతం ఉత్తీర్ణత సాధించాలని గిరిజన అభివృద్ధి శాఖ డిప్యూటీ డైరెక్టర్ జి.దేశీరాంనాయక్ అన్నారు. మహబూబాబాద్ మండలంలోని రెడ్యాల ప్రభుత్వ గిరిజన సంక్షేమ ఆశ్రమ ఉన్నత పాఠశాలను ఆయన శుక్రవారం ఆకస్మికంగా సందర్శించి తనిఖీ చేశారు. పాఠశాల ఆవరణ, మూత్రశాలలు, మరుగుదొడ్లు పరిశుభ్రంగా ఉంచాలని ఆదేశించారు. పదో తరగతి విద్యార్థులకు సబ్జెక్టుల వారీగా ఉదయం, సాయంత్రం తప్పనిసరిగా స్టడీ అవర్స్ నిర్వహించాలన్నారు. విద్యార్థులు వందశాతం ఉత్తీర్ణత సాధించే విధంగా కృషి చేయాలని సూచించారు. సమయపాలన పాటించని వారిపై క్రమశిక్షణ చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. పదో తరగతి విద్యార్థులు ఎవరైనా పరీక్ష తప్పినట్లయితే ఆ సబ్జెక్టు ఉపాధ్యాయుడిపై తీవ్రమైన చర్యలు ఉంటాయన్నారు.
Comments
Please login to add a commentAdd a comment