ప్రభుత్వమే తునికాకు సేకరణ చేపట్టాలి
మహబూబాబాద్ రూరల్: తునికాకు సేకరణ రాష్ట్ర ప్రభుత్వమే చేపట్టాలని కోరుతూ అఖిల భారత రైతు సంఘం ఆధ్వర్యంలో జిల్లా అటవీ అధికారి కార్యాలయం ఎదుట గురువారం ధర్నా నిర్వహించి అనంతరం పలు డిమాండ్లతో కూడిన వినతిపత్రాన్ని కార్యాలయ సిబ్బందికి అందజేశారు. ఈ సందర్భంగా ఏఐకేఎంఎస్ రాష్ట్ర కోశాధికారి నందగిరి వెంకటేశ్వర్లు, జిల్లా ప్రధాన కార్యదర్శి గుజ్జు దేవేందర్ మాట్లాడుతూ.. ఆదివాసీ ప్రాంతంలో ప్రధాన పంటగా కొనసాగుతున్న తునికాకుటెండర్లను ఇప్పటికే నిర్వహించి, ఫ్రూనింగ్ పనులు నిర్వహించాల్సి ఉందన్నారు. కానీ రాష్ట్ర ప్రభుత్వం నేటి వరకు టెండర్లను నిర్వహించలేదని, ఇప్పటికై నా కాంట్రాక్టర్లను ఆహ్వానించి టెండర్లు వేయాలని డిమాండ్ చేశారు. కాంట్రాక్టర్లు ముందుకు రాకపోతే రాష్ట్ర ప్రభుత్వమే నేరుగా తునికాకును సేకరించాలని, ఫ్రూనింగ్ పనులను ప్రారంభించాలన్నారు. సంఘం నాయకులు బండారి ఐలయ్య, ఊడుగుల లింగన్న, చింత వెంకన్న, బట్టు నాగేశ్వరరావు, రామచంద్రుని మురళి, కోడి నరసన్న, జంగిలి సోమనరసన్న, దేవబంగు భిక్షం, ఇరుగు నాగన్న, చిర్ర యకన్న, అన్నారపు హనుమంతు, ఎస్కే బాబు, మట్టిపెల్లి వీరభద్రరావు, అంజన్న, పూనెం పాపారావు తదితరులు పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment