ఏటీబీ(ఎనీటైం బ్యాగ్)
ప్లాస్టిక్ వాడకం విరివిగా పెరిగి భూమి కలుషితం కావడంతో పాటు ప్లాస్టిక్ సంచులలో తీసుకునే ఆహార పధార్థాలతో రకరకాల వ్యాధులు ప్రబలుతున్నాయి. ఈ తరుణంలో గుడ్డ సంచులను ఏటీబీ మిషన్‌ద్వారా తీసుకునే పరికరం రూపొందించాడు 10వ తరగతి విద్యార్థి రిషిక్. రూ.5 నాణెం మిషన్‌లో వేస్తే గుడ్డ సంచి వచ్చేలా తయారు చేశాడు. మిషన్‌లో 500 బ్యాగులు ఉంచేలా నిర్మించాడు. దీంతో పాటు మిషన్ లోపల ప్లాస్టిక్‌తో నష్టాలు, గుడ్డ సంచుల వల్ల లాభాలు, పర్యావరణ హితం కోరే విధంగా వివరించేలా స్పీకర్లు ఏర్పాటు చేశాడు. దీనిని బస్టాండ్ సెంటర్‌లు, కూరగాయాల మార్కెట్లు, రద్దీ ప్రదేశాలలో ఏర్పాటు చేస్తే ఫలితం ఉంటుందని వివరించాడు. ఒక్కో మిషన్‌కు రూ. 25 వేల ఖర్చు అవుతుంది. పరికరం తయారీకి కేంద్ర మంత్రిత్వశాఖ నిధులు మంజూరు చేయడానికి అంగీకరించింది.
Comments
Please login to add a commentAdd a comment