విద్యుదాఘాతంతో రైతు మృతి..
వర్ధన్నపేట: విద్యుదాఘాతంతో ఓ రైతు మృతి చెందా డు. ఈ ఘటన మండలంలోని ల్యాబర్తిలో చోటుచేసుకుంది. గ్రామస్తులు, కుటుంబ సభ్యుల కథనం ప్రకారం.. గ్రామానికి చెందిన బల్గురి వెంకటేశ్వర్లు(51) హైదరాబాద్‌లో కూలీ పనులు చేసుకుంటూ జీవిస్తున్నాడు. గ్రామంలో తనకున్న రెండెకరాల భూమిలో వరి సాగు చేసుకుంటున్నాడు. పంట పొలాన్ని హైదరాబాద్ నుంచి వస్తూపోతూ చూసుకుంటున్నాడు. ఈక్రమంలో శివరాత్రి పండుగకు ఇంటికి వచ్చాడు. గురువారం ఉదయం వ్యవసాయ పంపు వద్దకు వెళ్లాడు. మోటారు తీగలు సరి చేస్తున్న క్రమంలో విద్యుదాఘాతానికి గురై మృతి చెందాడు. కాగా, ట్రాన్స్‌ఫార్మర్‌కు ఆన్ ఆఫ్ సిస్టం లేకపోవడంతో విద్యుత్ సరఫరాలో ఇబ్బందులు ఏర్పడుతున్నాయని అధికారుల దృష్టికి తీసుకెళ్లినా పట్టించుకోలేదని కుటుంబీకులు తెలిపారు. విద్యుత్ అధికారుల నిర్లక్ష్యంతోనే రైతు మృతి చెందాడని గ్రామస్తులు ఆరోపించారు. ఈ ఘటనపై కుటుంబ సభ్యుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్లు వర్ధన్నపేట ఎస్సై రాజు తెలిపారు.
జంపన్న వాగు చెక్‌డ్యాం వద్ద
చేపలు పడుతూ మరొకరు..
ఎస్‌ఎస్‌తాడ్వాయి : చేపల వేటకు వెళ్లిన ఓ వ్యక్తి.. విద్యుదాఘాతానికి గురై మృతి చెందాడు.ఈ ఘటన గురువారం మండలంలోని ఎల్బాక జంపన్న వాగు చెక్‌డ్యాం వద చోటు చేసుకుంది. గ్రామస్తుల కథనం ప్రకారం.. మండలంలోని వెంగ్లాపూర్‌కు చెందిన ఈక కృష్ణమూర్తి(50) జంపన్నవాగు చెక్ డ్యాం వద్ద కొంత మంది కరెంట్ తీగలతో చేపలు పడుతుండగా వారితో కలిశాడు. ఈ క్రమంలో ఒడ్డుపై కరెంట్ తీగను పక్కకు జరుపుతున్న క్రమంలో విద్యుదాఘాతానికి గురై మృతి చెందినట్లు తెలిసింది. ఈవిషయంపై ఎస్సై శ్రీకాంత్‌రెడ్డిని అడగగా కృష్ణమూర్తి మృతిపై ఫిర్యాదు అందలేదన్నారు.
● ల్యాబర్తిలో ఘటన
● విద్యుత్ అధికారుల నిర్లక్ష్యమే కారణమని కుటుంబీకులు, గ్రామస్తుల ఆరోపణ
విద్యుదాఘాతంతో రైతు మృతి..
Comments
Please login to add a commentAdd a comment