హోలీ పండుగకు ఆరు ప్రత్యేక రైళ్లు
కాజీపేట రూరల్ : ప్రయాణికుల రద్దీని దృష్టిలో ఉంచుకుని హోలీ పండుగ సందర్భంగా కాజీపేట జంక్షన్ మీదుగా చర్లపల్లి–హజ్రత్‌నిజాముద్దీన్ మధ్య అప్ అండ్ డౌన్ మార్గంలో ఆరు ప్రత్యేక రైళ్ల సర్వీస్‌లు నడిపించనున్నట్లు దక్షిణ మధ్య రైల్వే చీఫ్ పబ్లిక్ రిలేషన్స్ ఆఫీసర్ ఎ.శ్రీధర్ సోమవారం తెలిపారు. మార్చి 6,12, 16వ తేదీల్లో చర్లపల్లి–హజ్రత్‌నిజాముద్దీన్ (07707) ఎక్స్‌ప్రెస్ కాజీపేట జంక్షన్‌కు 22.45 గంటలకు చేరుతుంది. అదేవిధంగా తిరుగుప్రయాణంలో మార్చి 8,14,18వ తేదీల్లో హజ్రత్‌నిజాముద్దీన్–చర్లపల్లి (07708) ఎక్స్‌ప్రెస్ కాజీపేట జంక్షన్‌కు మరుసటి రోజు 07.30 గంటలకు చేరుకుంటుందని తెలిపారు. సెకండ్ ఏసీ, థర్డ్ ఏసీ, స్లీపర్ క్లాస్, అండ్ జనరల్ కోచ్‌లతో ప్రయాణించే ఈ ప్రత్యేక రైళ్ల సర్వీస్‌లకు కాజీపేట, రామగుండం, మంచిర్యాల, సిర్పూర్‌కాగజ్‌నగర్, బల్హార్షా, చంద్రాపూర్, నాగ్‌పూర్, రాణి కమలాపతి, బీణా, ఝాన్సీ, ఆగ్రా, పల్‌వాల్ స్టేషన్లలో హాల్టింగ్ సౌకర్యం కల్పించినట్లు శ్రీధర్ తెలిపారు.
హ్యాండ్‌బాల్ పోటీలకు కేయూ మహిళా జట్టు
కేయూ క్యాంపస్ : తమిళనాడులోని పెరియార్ యూనివర్సిటీలో కొనసాగుతున్న సౌత్‌జోన్ ఇంటర్ యూనివర్సిటీ హ్యాండ్‌బాల్ పోటీలకు కాకతీయ యూనివర్సిటీ మహిళా జట్టు పాల్గొంటుందని కేయూ స్పోర్ట్స్ బోర్డు సెక్రటరీ వై.వెంకయ్య సోమవారం తెలిపారు. ఈజట్టులో ఎస్.భాగ్యశ్రీ, బి.శాంత, ఆర్.రేష్మ, బి.రమ్య (యూపీపీఈ కేయూ వరంగల్), బి.కావ్య, ఎం.త్రివేణి (టీజీఎస్‌డబ్ల్యూఆర్‌డీసీ వరంగల్ వెస్ట్), బి. మీనాక్షి, బి.నందిని(టీజీడబ్ల్యూఆర్‌డీసీ, కొత్తగూడెం), ఎం.కరీనా (టీటీడబ్ల్యూఆర్‌డీసీ, ఆసిఫాబాద్), ఎస్.నందిని ప్రభుత్వ (ఎస్‌ఆర్‌అండ్ బీజీఎన్‌ఆర్, ఖమ్మం), ఎస్.శివాని (యూసీఈటీడబ్ల్యూ, కేయూ), టి.స్నేహ, ఎ.శ్రీలేఖ, టి.నాన్సీ (వీసీపీఈ బొల్లికుంట), కె.సింధూజ (టీటీడబ్ల్యూఆర్‌డీసీ ఉట్నూరు), సీహెచ్ సునీత (యూసీపీఈ, ఖమ్మం) ఉన్నారు. వీరికి హనుమకొండలోని వాగ్దేవి డిగ్రీ, పీజీ కళాశాల పీడీ కె.మధుకర్ కోచ్ కమ్ మేనేజర్‌గా వ్యవహరిస్తున్నారని వెంకయ్య పేర్కొన్నారు.
హోలీ పండుగకు ఆరు ప్రత్యేక రైళ్లు
Comments
Please login to add a commentAdd a comment