బుల్లెట్, జావా బైక్‌ల ఢీ... ముగ్గురి దుర్మరణం
● జయశంకర్ భూపాలపల్లి జిల్లాలో ఘటన
భూపాలపల్లి రూరల్: బుల్లెట్, జావా బైక్‌లు ఢీకొని ముగ్గురు అక్కడికక్కడే దుర్మరణం చెందారు. ఈ ఘటన జయశంకర్ భూపాలపల్లి జిల్లా భూపాలపల్లి మండలం రాంపూర్ సమీప అటవీ ప్రాంతంలో సోమవారం రాత్రి చోటు చేసుకుంది. పోలీసులు,గ్రామస్తులు, ప్రయాణికుల కథనం ప్రకారం.. మహాముత్తారం మండలం మీనాజీపేట గ్రామానికి చెందిన పింగిళి రవీందర్‌రెడ్డి (45), కొమ్మిడి నర్సింహారెడ్డి అలియాస్ లడ్డూ (35) భూపాలపల్లి మండలం పెద్దాపూర్ గ్రామ శివారు పెర్కపల్లి బంధువుల వివాహానికి వెళ్లి తిరిగి మీనాజీపేటకు బుల్లెట్‌పై వస్తున్నారు. భూపాలపల్లి మండలం పంబాపూర్ గ్రామానికి చెందిన నర్సింగోజు సతీశ్(30) పంబాపూర్‌నుంచి జావా వాహనంపై కమలాపూర్ గ్రామంలోని అమ్మమ్మ ఇంటికి వచ్చే క్రమంలో రాంపూర్ గ్రామసమీపం.. మూల మలుపు వద్ద అటవీ ప్రాంతంలో రెండు బైక్‌లు వేగంగా ఎదురెదురుగా ఢీకొన్నాయి. తీవ్రగాయాలు కావడంతో ముగ్గురు అక్కడిక్కడే మృతి చెందారు. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనాస్థలికి చేరుకుని పరిస్థితిని సమీక్షించారు. మృతదేహాలను పోస్టుమార్టం నిమిత్తం 108 ద్వారా జిల్లా కేంద్రంలోని 100 పడకల ఆస్పత్రికి తరలించారు. మృతుడు పింగిళి రవీందర్‌రెడ్డికి భార్య, కుమారుడు, కొమ్మిడి నర్సింహారెడ్డికి భార్య, ఉండగా, నర్సింగోజు సతీశ్‌కు భార్య, ఇద్దరు కూతుళ్లు ఉన్నారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు భూపాలపల్లి సీఐ నరేశ్‌కుమార్ తెలిపారు.
వారం క్రితమే సొంతూరుకు వచ్చిన సతీశ్..
సతీశ్ హైదరాబాద్‌లో కుల వృత్తి వడ్రంగి పనులు చేస్తూ జీవనం సాగిస్తున్నాడు. కుటుంబ సభ్యులను కలిసేందుకు వారం రోజుల క్రితం భార్యాపిల్లలతో కలిసి తన సొంత గ్రామం పంబాపూర్‌కు వచ్చాడు. ముగ్గురి మృతితో రెండు గ్రామాల్లో విషాదఛాయలు అలుముకున్నాయి.
బుల్లెట్, జావా బైక్‌ల ఢీ... ముగ్గురి దుర్మరణం
బుల్లెట్, జావా బైక్‌ల ఢీ... ముగ్గురి దుర్మరణం
Comments
Please login to add a commentAdd a comment