
ముగిసిన ‘పది’ పరీక్షలు
మహబూబాబాద్ అర్బన్: జిల్లా వ్యాప్తంగా పదో తరగతి వార్షిక పరీక్షలు ప్రశాంతంగా ముగిశాయని జిల్లా విద్యాశాఖ అధికారి ఏ.రవీందర్‌రెడ్డి బుధవారం తెలిపారు. జిల్లాలో 46 పరీక్ష కేంద్రాల్లో పది పరీక్షలు జరిగాయని, మొత్తం రెగ్యూలర్ విద్యార్థులు 8,190 మంది కాగా 8,183 మంది విద్యార్థులు హాజరైయ్యారన్నారు. పలు పరీక్ష కేంద్రాలను రాష్ట్ర, జిల్లా పరీక్షల పరిశీలకులు తనిఖీ చేశారన్నారు. ఎక్కడ ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా ప్రశాంతంగా జరిగాయని, పరీక్షలకు సహకరించిన కలెక్టర్, అడిషనల్ కలెక్టర్లు, సీఎస్ డీఈఓ, ఫ్‌లైయింగ్ స్క్వాడ్ బృందాలు, పోలీస్ అధికారులకు, వైద్యశాఖ, విద్యుత్‌శాఖ అధికారులకు ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు. త్వరలోనే పరీక్షల ఫలితాలు వెలువడుతాయని, సప్లిమెంటరీ పరీక్షలకు విద్యాశాఖ అధికారులు, ప్రభుత్వ, ప్రైవేట్ పాఠశాలల అధికారులు, హెచ్‌ఎంలు, ఉపాధ్యాయులు సిద్ధంగా ఉండాలన్నారు.