
ఓపెన్ టెన్త్, ఇంటర్ పరీక్షలకు ఏర్పాట్లు చేయాలి
మహబూబాబాద్: ఓపెన్ టెన్త్, ఇంటర్ పరీక్షలకు పకడ్బందీగా ఏర్పాట్లు చేసి పరీక్షలు సజావుగా నిర్వహించాలని అదనపు కలెక్టర్ కె.వీరబ్రహ్మచారి అధికారులను ఆదేశించారు. కలెక్టర్ కార్యాలయంలోని మినీ సమావేశ మందిరంలో పరీక్షల ఏర్పాట్లపై సంబంధిత అధికారులతో అదనపు కలెక్టర్ సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా అదనపు కలెక్టర్ మాట్లాడుతూ ఈనెల 20 నుంచి 26వ తేదీ వరకు పరీక్షలు జరుగుతాయన్నారు. ఈనెల 26 నుంచి వచ్చే నెల 3 వరకు ప్రాక్టికల్ పరీక్షలు జరుగుతాయని దానికి తగ్గట్లు కేంద్రాల్లో అన్ని ఏర్పాట్లు చేయాలన్నారు. కేంద్రాల వద్ద 144 సెక్షన్ అమలు చేయాలని, సెల్ ఫోన్ ఇతర ఎలక్ట్రానిక్ పరికరాలను అనుమతించవద్దన్నారు. ఈ సమావేశంలో డీఈఓ రవీందర్‌రెడ్డి, జిల్లా ఇంటర్మీడియట్ అధికారి మదార్, అధికారులు పాల్గొన్నారు.
బిహార్ గవర్నర్‌ను కలిసిన
మౌంటైనర్ యశ్వంత్
మరిపెడ రూరల్: మరిపెడ మండలం భూక్యతండా గ్రామ పంచాయతీకి చెందిన మౌంటైనర్ భూక్య యశ్వంత్ బిహార్ గవర్నర్ ఆరిఫ్ మహమ్మద్ ఖాన్‌ను బీహార్ రాజ్‌భవన్‌లో బుధవారం మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా యశ్వంత్ తన ఫొటో ఫ్రేమ్‌ను గవర్నర్‌కు అందించి శుభాకాంక్షలు తెలిపారు. తనవంతు ప్రోత్సాహం, ఆశీస్సులు ఎల్లప్పుడు ఉంటాయని, విజయం వైపు దూసుకెళ్లాలని యశ్వంత్‌కు గవర్నర్ సూచించారు. ప్రపంచ రి కార్డు స్థాయి పర్వతాలను పట్టుదలతో అధిరోహించి భారత దేశ ఖ్యాతిని యావత్ ప్రపంచానికి చాటాలని గవర్నర్ కోరారు.
బీజేపీ ఆవిర్భావ వేడుకలు నిర్వహించాలి
మహబూబాబాద్ అర్బన్: ఈ నెల 6న బీజేపీ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు నిర్వహించాలని బీజేపీ జిల్లా అధ్యక్షుడు వల్లబు వెంకటేశ్వర్లు పిలుపునిచ్చారు. జిల్లా కేంద్రంలోని బీజేపీ కార్యాలయంలో బుధవారం ఏర్పాటు చేసిన సమావేశానికి జిల్లా అధ్యక్షుడు వల్లబు వెంకటేశ్వర్లు ముఖ్యఅతిథిగా హాజరై మాట్లాడారు. సన్న బియ్యం పంపిణీ కేంద్ర ప్రభుత్వం ద్వా రానే వస్తున్నాయని, రాష్ట్ర ప్రభుత్వం బూట కపు మాటలు చెబుతుందన్నారు. రాజీవ్ యు వ వికాసంలో ఎమ్మెల్యేల జోక్యం ఎందుకన్నా రు. ప్రతీ ఒక్క నిరుద్యోగికి వెంటనే పథకంలో భాగస్వామ్యం చేయాలని డిమాండ్ చేశారు. ఈ సమావేశంలో రాష్ట్ర కౌన్సిల్ సభ్యుడు క్యాచవల్ శ్యామ్‌సుందర్ శర్మ, మాజీ జిల్లా ప్రధాన కార్యదర్శి చీకటీ మహేష్ గౌడ్, నాయకులు పొద్దిల నరిసింహరెడ్డి, పల్లె సందీప్‌గౌడ్, సందీప్, సతీష్ తదితరులు పాల్గొన్నారు.
వ్యవసాయ మార్కెట్
ఆదాయం రూ.8.08కోట్లు
మహబూబాబాద్ రూరల్: మహబూబాబాద్ వ్యవసాయ మార్కెట్ క్రయవిక్రయాలు ఆదాయం 2024–25 సంవత్సరానికి సంబంధించి రూ.8.08 కోట్లు వచ్చిందని ఏఎంసీ చైర్మన్ సుధాకర్ నాయక్ అన్నారు. బుధవారం ఆయన మార్కెట్ ఆదాయ వివరాలను వెల్ల డించారు. ప్రభుత్వం 2024–25 సంవత్సరాని కి మార్కెట్ ఫీజు లక్ష్యం రూ.7,94,23,000 నిర్ధేశించిందని, ప్రభుత్వం నిర్ధేశించిన లక్ష్యం కంటే ఈ ఏడాది అదనంగా మార్కెట్ ఫీజు రూ.14,02,658 వసూలు అయ్యాయని తెలిపారు. మార్చి 31వ తేదీతో ముగిసిన ఆదాయ రాబడికి సంబంధించి వ్యవసాయ మార్కెట్ యార్డులో జరిపిన క్రయవిక్రయాలు (గంజ్) ద్వారా రూ.4,72,32,679 వచ్చిందన్నారు. మిల్లుల (డైరెక్ట్) వద్ద జరిగిన క్రయవిక్రయాల నుంచి రూ.49,07,984 ఆదాయం వచ్చిందని, చెక్ పోస్టు ద్వారా రూ.2,21,761 ఆదాయం వచ్చిందని, వివిధ ప్రభుత్వ రంగ సంస్థలైన కాటన్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా పత్తి కొనుగోళ్లు, పౌరసరఫరాల శాఖ, డీఆర్డీఏ సెర్ప్, సహకార శాఖ, ప్రాథమిక వ్యవసాయ సహకార పరపతి సంఘాలు జరిపిన ధాన్యం కొనుగోళ్ల ద్వారా రూ.2,84,63,246 ఆదాయం వచ్చిందన్నారు. మొత్తంగా రూ.8,08,25,658 ఆదాయం సమకూరిందన్నారు. ఈ ఏడాది మార్చి 31వ తేదీ నాటికి వ్యవసాయం మార్కె ట్ ఖాతాకు సంబంధించి ఖజానా (ట్రెజరీ) నిల్వ రూ.12,97,95,527 ఉందన్నారు.