
శుక్రవారం శ్రీ 4 శ్రీ ఏప్రిల్ శ్రీ 2025
– 8లోu
సాక్షి, మహబూబాబాద్: హత్యలు, హత్యాచారాలు, దొంగతనాలు జరిగినప్పుడు హడావుడి చేయడం కంటే.. అసలు నేరాలు జరగకుండా కట్టడి కోసం జిల్లా పోలీస్ యంత్రాంగం వినూత్న విధానాన్ని అమలు చేస్తోంది. ఈమేరకు పాత నేరస్తుల కదలికలపై నిఘా పెడితే.. కొత్త నేరస్తులను పట్టుకోవడం సులభతరమని ఆలోచించి ముందుకెళ్తోంది. ఇందుకోసం జిల్లా వ్యాప్తంగా పోలీస్‌స్టేషన్ల వారీగా పాత నేరస్తుల జాబితాను తయారు చేసి వారిపై ప్రత్యేక నిఘా పెడుతోంది.
నేరాల అదుపునకు మద్దతు
కొత్త సంఘటనలు జరిగినప్పుడల్లా పాత నేరస్తులను పిలిచి విచారిస్తారు. అలాగే కొత్త నేరస్తులను గుర్తించడంలో పాత నేరస్తుల సహకారం తీసుకునేందుకు పోలీసులు వినూత్నంగా ఆలోచిస్తున్నారు. ఇప్పటికే పాత నేరస్తులు రికార్డులు పరిశీలించడం, వేలి ముద్రలు సేకరించి ఏం జరిగింది అనేది తేల్చుకుంటారు. అయితే ప్రతీ పోలీస్ స్టేషన్ పరిధిలో ఉన్న పాత నేరస్తులపై ప్రత్యేక దృష్టి పెట్టి వారిలో మార్పునకు ప్రయత్నిస్తే.. మంచి ఫలితం ఉంటుందని పోలీసులు అంటున్నారు. వారి పరిశీలన వివరాలను రికార్డుగా నమోదు చేస్తే పాత, కొత్త నేరస్తులను గుర్తించడం సులభం అవుతుంది. అదే విధంగా పాత వారి సహకారంతో కొత్తవారిని పట్టుకోవడం, నేరాలు అదుపు చేసేందుకు దోహపడుతుంది. ఇందుకోసం నెలకోసారి పాత నేరస్తులను పిలవడం, అవసరమైతే వారి వద్దకు పోలీసులు వెళ్తున్నారు. పోలీసులు నిర్వహించి కార్యక్రమాల్లో భాగస్వామ్యులను చేసి సమాజంలో గౌరవం పెంచేలా ప్రయత్నించాలని ఎస్పీ జిల్లాలోని డీఎస్పీ స్థాయి నుంచి కింది స్థాయి సిబ్బంది వరకు మెసేజ్‌లు చేరవేసినట్లు తెలిసింది.
మార్పు తెస్తే మంచి ఫలితం
నేరం చేసిన వ్యక్తిని ఎప్పటికి నేరస్తుడిగా చూడడం సరికాదు. అతడిలో మార్పు తీసుకొచ్చేందుకు ప్రయత్నించాలి. సమాజంలో గౌరవం పెంచేలా చేస్తే తప్పకుండా మారుతాడు. ఇలా పాత నేరస్తుల్లో మార్పు వస్తే కొత్త నేరస్తులను పట్టుకోవడం సులభం. అందుకోసమే వారి జీవన విధానం ఎలా ఉంది.. మొదలైన వివరాలు సేకరించి అవసరమైతే కౌన్సెలింగ్ ఇచ్చేందుకు సిద్ధం అవుతున్నాం.
– సుధీర్ రాంనాథ్ కేకన్, ఎస్పీ
న్యూస్‌రీల్
నేరాల అదుపునకు వినూత్న విధానం
వారి కదలికలపై ప్రతీ నెల నివేదికలు
కొత్త కేసులను సునాయాసంగా
గుర్తించేందుకు అవకాశం
జిల్లాలోని పాత నేరస్తుల వివరాలు
సర్కిల్ డెకాయిట్లు కేడీలు అనుమానితులు రౌడీలు మొత్తం
మహబూబాద్ టౌన్ 1 0 60 51 112
మహబూబాబాద్(రూ) 3 1 186 96 286
గూడూరు 0 2 72 36 110
బయ్యారం 1 1 66 19 87
తొర్రూరు 2 2 135 98 237
మరిపెడ 6 0 93 72 171
మొత్తం 13 6 612 372 1,003
కదలికలపై ఆరా..
జిల్లా పరిధిలోనిమహబూబాబాద్, తొర్రూరు సబ్ డివిజన్లతో పాటు, ఐదు సర్కిళ్లు, 18 పోలీస్ స్టేషన్లు ఉన్నాయి. ఇందులో ఇప్పటి వరకు వివిధ నేరాలు, దొంగతనాలు, దోపిడీలు, హత్యలు చేసిన సంఘటనల్లో 1003మంది పాత నేరస్తులను ఆరా తీయడం మొదలు పెట్టారు. అయితే ఇందుకోసం ప్రత్యేక జాబి తాను తయారు చేయడం, వారి సెల్ నంబర్లు, వారు ప్రస్తుతం చేస్తున్న పని, ఆర్థిక పరిస్థితి మొదలైన వివరాలు సేకరిస్తున్నారు. అన్నింటిని బేరీజు చేసి వారి ప్రవర్తనలో మార్పు వచ్చింది.. రానిది గుర్తించి మారిన వారిని అభినందించడం, ఇంకా మార్పురాని వారిని పోలీసులు తరచూగా కలవడంతో పాటు కౌన్సెలింగ్ ఇస్తున్నారు.

శుక్రవారం శ్రీ 4 శ్రీ ఏప్రిల్ శ్రీ 2025

శుక్రవారం శ్రీ 4 శ్రీ ఏప్రిల్ శ్రీ 2025

శుక్రవారం శ్రీ 4 శ్రీ ఏప్రిల్ శ్రీ 2025