
వృద్ధుడికి అరుదైన గుండె శస్త్రచికిత్స
కాజీపేట అర్బన్: హంటర్‌రోడ్డులోని మెడికవర్ ఆస్పత్రిలో 77 ఏళ్ల వృద్ధుడికి వైద్యులు అరుదైన గుండె శస్త్రచికిత్స చేసి అతడి ప్రాణాలు కాపాడారు. ఆస్పత్రిలో శుక్రవారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో శస్త్రచికిత్స వివరాలను వైద్యుడు షఫీ వెల్లడించారు. వరంగల్‌కు చెందిన వృద్ధుడు మా మిడిపల్లి ముకుందాచారి ఇటీవల తీవ్రమైన గుండె నొప్పితో ఆస్పత్రికి వచ్చాడని తెలిపారు. వైద్య పరీక్షల అనంతరం ట్రిపుల్ వెస్సెల్ డిసీజ్, రైట్ కరోనరీ ఆర్టరీ, లెఫ్ట్ సర్మమ్ ఫ్లెక్స్ ఆర్టరీ, యాంటీరియర్ డిసెండింగ్ ఆర్టరీ, స్టెనోసిస్‌గా గుర్తించినట్లు తెలిపారు. ఈక్రమంలో డ్రగ్ ఎలుటింగ్ స్టెంట్, డ్రగ్ ఎలుటింగ్ బలూన్ గుండె శస్త్రచికిత్స నిర్వహించినట్లు వివరించారు. శస్త్రచికిత్స అనంతరం వృద్ధుడు పూర్తి ఆరోగ్యంగా ఉన్నట్లు షఫీ వెల్లడించారు.