
మహోన్నత వ్యక్తి జగ్జీవన్‌రామ్
మహబూబాబాద్ అర్బన్: మహోన్నత వ్యక్తి బాబు జగ్జీవన్‌రామ్ అని, ఆయనను ప్రతిఒక్కరూ ఆదర్శంగా తీసుకోవాలని ప్రభుత్వ విప్ డాక్టర్ జాటోత్ రామచంద్రునాయక్ అన్నారు. జిల్లా కేంద్రంలోని రైల్వే స్టేషన్ సమీపంలో బాబు జగ్జీవన్‌రామ్ 118 జయంతి పురస్కరించుకొని శనివారం జగ్జీవన్‌రామ్ విగ్రహానికి ఎమ్మెల్యేలు డాక్టర్ జాటోతు రామచంద్రునాయక్,డాక్టర్ భూక్య మురళీనాయక్, ఎమ్మెల్సీ తక్కెళ్లపల్లి రవీందర్‌రావు, పలు ప్రజా, కుల సంఘాల, పార్టీల నాయకులు పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా రామచంద్రునాయక్ మాట్లాడుతూ.. దళిత వర్గాల పెన్నిది, సమతావాది డాక్టర్ బాబు జగ్జీవన్‌రావు ఆఽశయ సాధనకు కృషి చేయాలని పిలుపునిచ్చారు. జిల్లా కేంద్రంలోని డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ భవన నిర్మాణానికి ఇద్దరు ఎమ్మెల్యేలు సహకరిస్తామన్నారు. ఎమ్మెల్యే భూక్య మురళీనాయక్, మాట్లాడుతూ బ డుగు బలహీన వర్గాల అభ్యున్నతికి కృషి చేసిన మహనీయుడు జగ్జీవన్‌రామ్ అని కొనియాడారు. మహానీయుల బాటలో విద్యార్థులు నడుచుకుని కష్టపడి చదుకోవాలని ఎమ్మెల్సీ రవీందర్‌రావు అన్నారు. ఈ కార్యక్రమంలో కలెక్టర్ అద్వైత్ కుమార్ సింగ్, అడిషనల్ కలెక్టర్ లెలిన్ వత్సల్ టొప్పొ, షెడ్యూల్ కులాల అధికారి బి.నరసింహస్వామి, వివిధ కుల, ప్రజా సంఘాల నాయకులు పాల్గొన్నారు.
కలెక్టరేట్ సమావేశ మందిరంలో..
మహబూబాబాద్: కలెక్టర్ కార్యాలయంలోని ప్రధా న సమావేశ మందిరంలో శనివారం మాజీ ఉప ప్రధాని డాక్టర్ బాబు జగ్జీవన్‌రామ్ 118వ జయంతిని కలెక్టర్ అద్వైత్‌కుమార్‌సింగ్ అధ్యక్షతన నిర్వహించారు. ఈ సందర్బంగా ప్రభుత్వ విప్ రామచంద్రునాయక్ మాట్లాడుతూ జగ్జీవన్‌రామ్ ఆశయ సాధనకు పాటుపడాలన్నారు. అసమానతలను రూపుమాపేందుకు ప్రతిఒక్కరూ బాధ్యత తీసుకో వాలని ఎమ్మెల్యే డాక్టర్ భూక్య మురళీనాయక్ అ న్నారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్సీ తక్కెళ్లపల్లి రవీందర్‌రావు,అదనపు కలెక్టర్ లెనిన్ వత్సల్ టొ ప్పో, సాంఘిక సంక్షేమ శాఖ జిల్లా అధికారి నర్సింహస్వామి, డీపీఓ హరిప్రసాద్, జిల్లా అధికారులు, దళిత సంఘాల ప్రతినిధులు పాల్గొన్నారు.
ప్రభుత్వ విప్ డాక్టర్ జాటోత్ రామచంద్రునాయక్
జిల్లాలో ఘనంగా 118వ జయంతి
నివాళులర్పించిన కలెక్టర్
అద్వైత్‌కుమార్ సింగ్, ఎమ్మెల్యే,
ఎమ్మెల్సీ, కుల సంఘాల నాయకులు

మహోన్నత వ్యక్తి జగ్జీవన్‌రామ్