అంగన్‌వాడీల్లో కొలువులు
మహబూబ్‌నగర్ రూరల్: జిల్లాలో అంగన్‌వాడీ కేంద్రాల్లో ఖాళీగా ఉన్న కొలువులు(ఉద్యోగాలను) భర్తీ చేసేందుకు ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. చిన్నారులు, గర్భిణులు, బాలింతలకు నాణ్యమైన పౌష్టికాహారం, పూర్వ ప్రాథమిక విద్యను అందించేందుకు వీలుగా అంగన్‌వాడీ ఉపాధ్యాయ(టీచర్), సహాయకుల(ఆయా) పోస్టులను ప్రభుత్వం భర్తీ చేయనుంది. జిల్లాలో దేవరకద్ర, జడ్చర్ల, మహబూబ్‌నగర్ అర్బన్, మహబూబ్‌నగర్ రూరల్ ప్రాజెక్టులు ఉన్నాయి. వీటి పరిధిలో 1185 అంగన్‌వాడీ కేంద్రాలు కొనసాగుతున్నాయి. ప్రస్తుతం 1,130 మంది టీచర్లు విధులు నిర్వర్తిస్తున్నారు. టీచర్ పోస్టులు 55, ఆయా పోస్టులు 314 ఖాళీలు ఉన్నట్లు అధికారులు గుర్తించారు. ఖాళీల నివేదికలను ఉన్నతాధికారులకు అందించారు. జిల్లాలో పలు కారణాలతో ఖాళీగా ఉన్న టీచర్లు, ఆయాల పోస్టులను భర్తీ చేయలేదు. కొన్నేళ్లుగా వాటి నిర్వహణకు కూడా ఇబ్బందిగా మారింది. మరికొన్ని చోట్ల కొందరు టీచర్లకు అదనపు కేంద్రాలను అప్పగించగా విధులు నిర్వర్తిస్తున్నారు. ఖాళీ ఉన్న కేంద్రాల నిర్వహణ సూపర్‌వైజర్లకు, సీడీపీఓలకు ఇబ్బందిగా మారింది. కొన్ని ప్రాంతాల్లో ప్రజాప్రతినిధులు ఫిర్యాదు చేయడం, కేంద్రాల నిర్వహణ సరిగా లేదనే ఆరోపణలు కూడా ఉన్నాయి. ఖాళీలను భర్తీ చేస్తే అంగన్‌వాడీ కేంద్రాల నిర్వహణ మెరుగుపడుతుందని తెలుస్తుంది. అంగన్‌వాడీ టీచర్ పోస్టుకు గతంలో పదో తరగతి ఉత్తీర్ణత కావాలన్న నిబంధన ఉండేది. కేంద్ర ప్రభుత్వం జారీచేసిన నూతన మార్గదర్శకాల ప్రకారం అంగన్‌వాడీ టీచర్‌తో పాటు ఆయా పోస్టుకు కనీసం ఇంటర్ పాసై ఉండాలని నిబంధన ఉంది.
ఖాళీల వివరాలను గుర్తించాం
అంగన్‌వాడీ కేంద్రాల్లో ఖాళీల వివరాలను గుర్తించాం. ఆ కేంద్రాలను నిర్వహించే అంగన్‌వాడీ టీచర్లు, మాతా శిశువులకు పౌష్టికాహారం అందించేందుకు కృషి చేస్తున్నాం. ఖాళీగా ఉన్న కేంద్రాలకు సమీపంలో ఉన్న కేంద్రాల నుంచి టీచర్లను, ఆయాలను సర్దుబాటు చేశాం. సూపర్‌వైజర్లతో నిరంతర పర్యవేక్షణ చేస్తున్నాం. లబ్ధిదారులకు ఎలాంటి ఇబ్బందులు కలుగకుండా చర్యలు చేపడుతున్నాం.
– జరీనాబేగం, జిల్లా సీ్త్ర, శిశు సంక్షేమశాఖ అధికారి, మహబూబ్‌నగర్
జిల్లాలో 55 టీచర్, 314 ఆయా పోస్టుల భర్తీకి కసరత్తు
త్వరలో నోటిఫికేషన్
మారిన విద్యార్హత నిబంధన
అంగన్‌వాడీల్లో కొలువులు
Comments
Please login to add a commentAdd a comment