నేటి నుంచి మైసమ్మ ఆలయ వార్షికోత్సవాలు
నవాబుపేట: పర్వతాపూర్ మైసమ్మ తల్లికి మరోసారి భక్తిశోభ సంతరించుకోనుంది. మైసమ్మ ఆలయ వార్షికోత్సవాలు సోమవారం నుంచి ప్రారంభం కానున్నట్లు ఆలయ చైర్మన్ జగన్‌మోహన్‌రెడ్డి, దేవాలయాధికారి నర్సింహులు తెలిపారు. 16వ వార్షికోత్సవ కార్యక్రమాల్లో భాగంగా సోమవారం ధ్వజారోహణం, గణపతి పూజ, కలశాభిషేకం, 4వ తేదీ మంగళవారం సాముహిక కుంకుమార్చన, ప్రత్యేక అలంకరణ, మంగళహారతి కార్యక్రమాలు ఉంటాయన్నారు. ఈ కార్యక్రమాలకు ఎంపీ డీకే ఆరుణ, ఎమ్మెల్యే అనిరుధ్ రెడ్డితో పాటు స్థానిక ప్రజాప్రతినిధులు, అధికారులు పాల్గొననున్నట్లు వారు వివరిచారు. భక్తులు పెద్ద ఎత్తున ఈ కార్యక్రమాల్లో పాల్గొనాలని కోరారు. కాగా ఆదివారం అమ్మవారి దేవాలయంలో భక్తులు భారీ సంఖ్యలో హాజరై అమ్మవారికి ప్రత్యేక పూజలు, నైవేద్యాలు సమర్పించారు.
నేటి నుంచి మైసమ్మ ఆలయ వార్షికోత్సవాలు
Comments
Please login to add a commentAdd a comment