
ముగిసిన ‘పది’ పరీక్షలు
మహబూబ్‌నగర్ ఎడ్యుకేషన్: జిల్లావ్యాప్తంగా గత పదిరోజులుగా జరిగిన ఎస్సెస్సీ పరీక్షలు బుధవారం ముగిశాయి. ఈ మేరకు చివరి రోజు సోషల్ పరీక్ష ప్రశాంతంగా జరిగింది. మొత్తం 12,776 మంది విద్యార్థులకు గాను.. 12,739 మంది హాజరవగా.. 37 మంది గైర్హాజరయ్యారు. గురువారం 9 పరీక్ష కేంద్రాల్లో ఒక సబ్జెక్టుకు సంబంధించి ఒకేషనల్ పరీక్ష జరగనుంది. అసలు పరీక్షలు ముగియడంతో విద్యార్థులు హాస్టళ్లు, రూంలను ఖాళీ చేసి ఇంటి బాట పట్టారు. దీంతో ఆర్టీసీ బస్టాండ్ కిటకిటలాడింది. కాగా.. ఇప్పటికే జవాబుపత్రాల మూల్యాంకణం ప్రారంభం కాగా.. జిల్లాకేంద్రంలోని మహబూబ్‌నగర్ గ్రామర్ స్కూల్‌లో వ్యాలువేషన్ క్యాంపును విద్యా శాఖ అధికారులు ఏర్పాటు చేశారు. మొత్తం వ్యాలువేషన్‌కు 2.40 లక్షల పేపర్లు రావాల్సి ఉండగా ఇప్పటి వరకు 1.90 లక్షల పేపర్లు వచ్చాయి.
చివరిరోజు 12,739 మంది విద్యార్థుల హాజరు