
మూడు రూపాయల వడ్డీకి తెచ్చి..
నాకు రెండెకరాల 28 గుంటల భూమి ఉంది. ఆ పొలంలో వరి సాగు చేశాను. ప్రభుత్వం సీజన్ ప్రారంభంలో రైతు భరోసా డబ్బులు ఇవ్వకపోవడంతో వడ్డీ వ్యాపారితో నూటికి మూడు రూపాయల చొప్పున అప్పు తెచ్చి పంట సాగు చేసుకున్నాం. ఎకరాకు రూ.35 వేల పెట్టుబడి అయింది. యాసంగి సీజన్ ముగింపు దశకు వచ్చినా ఇంకా పెట్టుబడి డబ్బు పడలేదు. ప్రభుత్వం పెట్టుబడి సాయం అందిస్తే కోతలు, కూలీల అవసరాలకు ఉపయోగపడతాయి. – బొక్క దేవన్న,
రైతు, తాటికొండ, భూత్పూర్ మండలం