
వక్ఫ్ బోర్డు సవరణ చట్టాన్ని వెనక్కి తీసుకోవాలి
జెడ్పీసెంటర్(మహబూబ్‌నగర్): ముస్లింల హక్కులను కాలరాయడం కోసం తెచ్చిన వక్ఫ్ బోర్డు సవరణ చట్టాన్ని వెనక్కి తీసుకోవాలని ఇన్సాఫ్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఫయాజ్ డిమాండ్ చేశారు. సీపీఐ పార్టీ పిలుపులో భాగంగా బుధవారం స్థానిక తెలంగాణ చౌరస్తాలో నిరసన కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ వక్ఫ్ చట్టాన్ని వెనక్కి తీసుకునే వరకు పోరాటం చేస్తామని హెచ్చరించారు. దేశంలోని మైనార్టీలపై కేంద్రంలో అధికారంలోఉన్న బీజేపీ సర్కారు కక్ష సాధింపు చర్యలకు పాల్పడుతుందన్నారు. దేశంలో భాగమైన ఓ వర్గం ప్రజలపై కక్ష సాధింపులకు దిగడం సరికాదన్నారు. ముస్లిం ఆత్మగౌరవానికి భంగం కలించే ఏ చర్యలను తాము సహించేది లేదని అన్నారు.కార్యక్రమంలో సీపీఐ జిల్లా కార్యదర్శి బాలకిషన్, నాయకులు పరమేశ్‌గౌడ్, రాముల, గోవర్థన్, సత్యనారాయణరెడ్డి, బాషా, రాజు, లక్ష్మన్, శ్రీను, సురేష్, ఖద్దుస్‌బేగ్, సుభానిపటేల్, నసీర్, తకీహుస్సెన్ తదితరులు పాల్గన్నారు.