
పంచాయతీ వర్కర్ల సమస్యలు పరిష్కరించాలి
మహబూబ్‌నగర్ న్యూటౌన్: గ్రామ పంచాయితీ వర్కర్ల సమస్యలను ప్రభుత్వం వెంటనే పరిష్కరించాలని తెలంగాణ ప్రగతిశీల గ్రామపంచాయితీ వర్కర్ల యూనియన్ జిల్లా అధ్యక్షుడు జి.వెంకట్రాములు డిమాండ్ చేశారు. రాష్ట్ర కమిటీ పిలుపు మేరకు గురువారం జిల్లాకేంద్రంలోని తెలంగాణ చౌరస్తాలో ధర్నా కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ జీఓ 60 ప్రకారం జీతాలు పెంచాలని, పెండింగ్ వేతనాలు ఇవ్వాలని, జీఓ 51ను రద్దు చేయాలని డిమాండ్ చేశారు. కార్యక్రమంలో టీయూసీఐ రాష్ట్ర సహాయ కార్యదర్శి వెంకటేశ్, జిల్లా అధ్యక్షుడు దేవదానం, సాంబశివుడు, కుర్మయ్య, వెంకట్రాములు, తిమ్మయ్య, రంగయ్య తదితరులు పాల్గొన్నారు.