తండావాసి..శాస్త్రవేత్తగా
● మహాతండాకు చెందిన ఆకాశ్ ● అభినందించిన గ్రామస్తులు
నార్నూర్: అతనికి కాన్వెంట్ చదువులంటే తెలియదు. కార్పొరేట్ కళాశాలలో చేరలేదు. లక్షల రూపాయలు వెచ్చించి శిక్షణ పొందలే దు. పట్టుదలతో చదివి తన కల సాకారం చేసుకుని శాస్త్రవేత్త అయ్యి యువతకు ఆదర్శంగా నిలిచాడు. ఆయనే నార్నూర్ మండలంలోని మహాగావ్ తండాకు చెందిన చౌహాన్ ఆకాశ్. ప్రతిష్టాత్మకమైన రీసెర్చ్ అసోసియేట్ సైంటిస్ట్ సెంటర్ ఫర్ మెటీరియల్స్ ఫర్ ఎలక్ట్రానిక్ టెక్నాలజీ (సీ–మెట్), హైదరాబాద్‌కు ఎంపికయ్యాడు. 15 రోజుల క్రితం శాస్త్రవేత్తగా విధులు చేరాడు. ఈయన తల్లిదండ్రులు జీజాబా యి, ప్రహ్లాద్. వీరికి ఇద్దరు సంతానం. వ్యవసా యం చేస్తూ వారిని కష్టపడి చదివించారు. చిన్న కుమారుడైన ఆకాశ్ 1 నుంచి పదో తరగతి వర కు నార్నూర్ ప్రభుత్వ పాఠశాలలో చదివాడు. ఐటీడీఏ సహకారంతో హైదరాబాద్‌లోని శ్రీ చైతన్య జూనియర్ కళాశాలలో ఇంటర్ పూర్తిచేశాడు. ఏఐఈఈఈ పరీక్ష రాసి ఆలిండియా స్థాయిలో 178వ ర్యాంకు సాధించి వరంగల్ నిట్‌లో బీటెక్ పూర్తిచేశాడు. అనంతరం హైదరాబాద్ సెంటర్ యూనివర్సిటీలో చేరి మెటీరియల్ ఇంజినీరింగ్‌లో ఐదేళ్లపాటు పరిశోధన చేశాడు. ప్రస్తుతం సీ–మెట్‌లో రీసెర్చ్ అసోసియేట్, సైంటిస్టుగా విధులు నిర్వహిస్తున్నాడు. తండా నుంచి శాస్త్రవేత్తగా ఎదిగిన ఆకాశ్‌ను గ్రామస్తులు అభినందించారు.
Comments
Please login to add a commentAdd a comment