‘అపూర్వ’ సమ్మేళనం | - | Sakshi
Sakshi News home page

‘అపూర్వ’ సమ్మేళనం

Apr 13 2025 12:04 AM | Updated on Apr 13 2025 12:04 AM

‘అపూర్వ’ సమ్మేళనం

‘అపూర్వ’ సమ్మేళనం

● 1980 నుంచి ఇప్పటి వరకు ఆయా బ్యాచ్‌ల పూర్వ విద్యార్థులు హాజరు ● ప్రభుత్వ సంజయ్‌గాంధీ పాలిటెక్నిక్‌ కళాశాలలో సంబురం

ఆదిలాబాద్‌టౌన్‌: వారంతా ఒకేచోట చదువుకున్న మిత్రులు.. పదో తరగతి పూర్తయ్యాక జిల్లా కేంద్రంలోని పాలిటెక్నిక్‌ కళాశాలలో వివిధ కోర్సుల్లో చేరారు. చదువు పూర్తయిన తర్వాత ఎవరిదారిలో వారు వెళ్లారు. ఇంజినీర్లు, సైంటిస్టులు, లెక్చరర్లతో పాటు వివిధ హోదాల్లో, మరికొందరు సర్కారు కొలువుల్లో ఉండగా, ఉద్యోగ విరమణ పొందారు. ఎక్కడెక్కడో స్థిరపడిన వారంతా 45 ఏళ్ల తర్వాత మళ్లీ చదువులమ్మ ఒడిలో కలుసుకున్నారు. ఆత్మీ య పలకరింపులు, ఆలింగనాల నడుమ నాటి చిలి పి, అల్లరిచేష్టలు, మధుర స్మృతులను నెమరు వేసుకున్నారు. వారు చదువుకున్న తరగతి గదుల్లో కూ ర్చొని ఒక్కసారి పాత జ్ఞాపకాలను గుర్తుకు తెచ్చుకున్నారు. నాడు విద్యాబుద్ధులు నేర్పిన గురువులను సత్కరించి జ్ఞాపికలు అందజేశారు. రోజంతా ఉల్లాసంగా గడిపారు. ఈ అపురూపమైన ఘట్టానికి ఆదిలాబాద్‌లోని ప్రభుత్వ సంజయ్‌గాంధీ పాలిటెక్నిక్‌ కళాశాల వేదికై ంది. కళాశాలలో శనివారం పూర్వ విద్యార్థుల సమ్మేళన కార్యక్రమాన్ని నిర్వహించారు. పూర్వ విద్యార్థులందరు ఒకేచోట చేరడంతో సందడి వాతావరణం నెలకొంది. ప్రస్తుతం ఏం చేస్తున్నారు.. ఎక్కడ ఉంటున్నారు.. ఇక నుంచి టచ్‌లో ఉండాలంటూ ఫోన్‌ నంబర్లు తీసుకోవడంతో పాటు ఈ మధుర జ్ఞాపకా లను సెల్‌ఫోన్లు, కెమెరాల్లో బంధిస్తూ సెల్ఫీలు దిగా రు. పూర్వ విద్యార్థుల కార్యవర్గాన్ని ఏర్పాటు చేశారు.

1980 నుంచి ఇప్పటివరకు..

జిల్లా కేంద్రంలో ప్రభుత్వ పాలిటెక్నిక్‌ కళాశాల 1980లో ఏర్పడింది. ఇక్కడ మెకానిక్‌ సివిల్‌, ఎలక్ట్రికల్‌, కంప్యూటర్‌, డీసీసీపీ ఇతర కోర్సుల్లో బోధన చేపడుతున్నారు. మొదటి బ్యాచ్‌ నుంచి ఇప్పటి వరకు చదువుతున్న పూర్వ విద్యార్థులు ఒకే చెంతకు చేరారు. గత రెండేళ్లుగా ఈ కార్యక్రమం నిర్వహించేందుకు పూర్వ విద్యార్థుల శ్రమ ఎంతగానో ఉంది. వాట్సాప్‌ గ్రూపులు ఏర్పాటు చేసి కార్యక్రమంలో పాల్గొనాలని ఆహ్వానం పంపారు. దాదాపు 600 మంది పూర్వ విద్యార్థులు చేరుకున్నారు. ఉమ్మడి జిల్లాకు చెందినవారు 250 మంది వరకు ఉండగా రాష్ట్రాలు, జిల్లాలు, దుబాయ్‌ నుంచి 62 ఏళ్ల రహీమొద్దీన్‌ హాజరయ్యారు. శ్రీహరికోటలో శాస్త్రవేత్తగా పనిచేస్తున్న చంద్రశేఖర్‌, సెక్రెటరి టు గవర్నమెంట్‌ లా డిపార్ట్‌మెంట్‌కు చెందిన రేండ్ల తిరుపతి తన అభినందన పత్రాన్ని పంపించారు. నిర్మల్‌ డీఎఫ్‌వో రమేశ్‌రావు, హైదరాబాద్‌లోని టౌన్‌ప్లానింగ్‌ డిప్యూ టీ డైరెక్టర్‌ వసంత్‌రావు, జీహెచ్‌ఎంసీలో రిటైర్డ్‌ ఏ ఈ రఘునందన్‌, రిటైర్డ్‌ ప్రిన్సిపాళ్లు ఎల్లారెడ్డి, బాలనర్సిములు, నిరంజన్‌, రిటైర్డ్‌ అసిస్టెంట్‌ ప్రొఫెసర్‌ చల్ల విజయ్‌బాబుతో పాటు ఇక్కడ పనిచేసిన ప్రి న్సిపాళ్లు, లెక్చరర్లు, వివిధ హోదాల్లో ఉన్న పూర్వ విద్యార్థులు హాజరయ్యారు. కళాశాల ప్రిన్సిపాల్‌ రాంబాబు, పూర్వ విద్యార్థుల సంఘం అధ్యక్షుడు అభయ్‌ రాజు, రిటైర్డ్‌ లెక్చరర్‌ విజయ్‌బాబు, మాజీ ఎమ్మెల్సీ పురాణం సతీశ్‌, తదితరులు పాల్గొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement