
అనుమానాస్పదంగా వ్యక్తి మృతి
నస్పూర్: సీసీసీ నస్పూర్ పోలీస్ స్టేషన్ పరిధిలోని మూన్ లైట్ బార్ బిల్డింగ్ సెల్లార్ కింద వాష్ రూమ్ సమీపంలో గుర్తు తెలియని వ్యక్తి మృతదేహం లభ్యమైనట్లు సీఐ ఆకుల అశోక్ తెలిపారు. బార్ యజమాని ఆదివారం సెల్లార్ కిందకు వెళ్లి చూడగా దుర్వాసన రావడంతో పోలీసులకు సమాచారం అందించాడు. మృతదేహాన్ని పరిశీలించిన పోలీసులు నాలుగు రోజుల క్రితం మృతి చెందినట్లు ఉందన్నారు. మృతదేహం పూర్తిగా కుళ్లిపోయి గుర్తు తెలియని స్థితిలో ఉందన్నారు. బార్ యజమాని ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి ఽసీసీ పుటేజీ ఆధారంగా విచారణ జరుపుతున్నట్లు సీఐ తెలిపారు.
రోడ్డు ప్రమాదంలో ఒకరు మృతి
బోథ్: రోడ్డు ప్రమాదంలో ఒకరు మృతి చెందిన సంఘటన మండలంలో చోటు చేసుకుంది. సీఐ వెంకటేశ్వరరావు తెలిపిన వివరాల మేరకు ధన్నూర్(బి) గ్రామానికి చెందిన ముసుగు రాకేశ్‌రెడ్డి (37), ముద్దం రాజు ఆదివారం సాయంత్రం ద్విచక్ర వాహనంపై బోథ్ నుంచి స్వగ్రామానికి వెళ్తుండగా సాయినగర్ కాలనీ వద్ద పెట్రోల్ పంపు సమీపంలో ఎదురుగా వచ్చిన టాటాఏస్ వాహనం ఢీకొట్టింది. ఘటనలో ఇద్దరికి తీవ్రగాయాలు కావడంతో 108లో బోథ్‌లోని సీహెచ్‌సీకి తరలించారు. మెరుగైన వైద్యం కోసం నిర్మల్ జిల్లా కేంద్రానికి తరలిస్తుండగా రాకేష్‌రెడ్డి మార్గమధ్యలో మృతి చెందాడు. మృతునికి భార్య, కుమారుడు ఉన్నారు.