
అకాల వర్షం.. తడిసిన ధాన్యం
ఆందోళనలో అన్నదాతలు
మెదక్‌జోన్/చిలప్‌చెడ్(నర్సాపూర్)/టేక్మాల్(మెదక్): ఈదురుగాలులతో కురిసిన వర్షం ధాన్యం ఆరబోసుకున్న రైతులను అతలాకుతలం చేసింది. అకాల వర్షంతోపాటు జోరుగా వడగండ్లు పడడంతో రోడ్ల వెంట ఆరబెట్టిన ధాన్యంతోపాటు కొనుగోలు కేంద్రాల్లో నిలువ ఉంచిన ధాన్యం రాశులు తడిచి ముద్దయ్యాయి. మెదక్‌లో మంగళవారం సాయంత్రం 5గంటలకు ఒక్కసారిగా వాతావరణం చల్లబడి అరగంట పాటు ఏకదాటిగా వర్షం కురిసింది. అలాగే చిలప్‌చెడ్ మండలంలోని పలు గ్రామాలలో వర్షం ఎక్కువగా కురవడంతో కల్లాలలో వరదనీరు చేరింది. ధాన్యం కుప్పల కిందకు నీరు రాకుండా రైతులు నానా తంటాలు పడ్డారు. కొనుగోలు కేంద్రాల్లో సరిపడా టార్ఫాలిన్లు లేక ఇబ్బందులు పడ్డారు.

అకాల వర్షం.. తడిసిన ధాన్యం
Comments
Please login to add a commentAdd a comment