కేంద్ర బడ్జెట్‌ను సవరించాలి: సీపీఎం
మెదక్ కలెక్టరేట్: కేంద్ర బడ్జెట్‌ను సవరించి రైతులు, కార్మికులు, పేదలకు అధిక నిధులు కేటాయించాలని సీపీఎం జిల్లా కార్యదర్శి కడారి నర్సమ్మ డిమాండ్ చేశారు. ఈమేరకు బుధవారం కలెక్టరేట్ ఏఓ యూనుస్‌కు వినతిపత్రం అందజేశారు. ఈసందర్భంగా ఆమె మాట్లాడుతూ.. కార్పొరేట్ పన్నులు పెంచాలని డిమాండ్ చేశారు. వ్యవసాయ ఉత్పత్తులకు కనీస మద్దతు ధర కల్పించాలన్నారు. ప్రభుత్వ సంస్థలను ప్రైవేట్ వారికి అప్పగించడం సరికాదన్నారు. ప్రభుత్వ రంగాన్ని ప్రైవేటీకరణ చేయరాదన్నారు. వెనుకబడిన తరగతులకు అధిక నిధులు కేటాయించకుండా సబ్ కా వికాస్ ఎలా సాధ్యమవుతుందని ప్రశ్నించారు. ఇప్పటికై నా కేంద్ర ప్రభుత్వం స్పందించి బడ్జెట్‌ను సవరించాలని కోరారు. కార్యక్రమంలో జిల్లా కార్యదర్శి వర్గ సభ్యులు అజ్జమర్రి మల్లేశం, కోరెంకల మల్లేశం, జిల్లా కమిటీ సభ్యులు సంతోష్ నాయకులు తదితరులు పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment