బాధతో వచ్చే వారికి భరోసా ఇవ్వాలి
ఎస్పీ ఉదయ్‌కుమార్‌రెడ్డి
హవేళిఘణాపూర్(మెదక్): ఏదైనా సమస్యతో పోలీస్‌స్టేషన్‌కు వచ్చే బాధితులకు మేమున్నామంటూ భరోసా ఇచ్చి వారి సమస్యను పరిష్కరించేందుకు కృషి చేయాలని ఎస్పీ ఉదయ్‌కుమార్‌రెడ్డి అన్నారు. గురువారం మెదక్‌రూరల్ పోలీస్‌స్టేషన్‌ను ఆకస్మికంగా తనిఖీ చేసి రికార్డులను పరిశీలించారు. కేసుల వివరాలను అడిగి తెలుసుకున్నారు. అనంతరం ఎస్పీ మాట్లాడుతూ.. పోలీస్‌స్టేషన్‌కు వచ్చే బాధితులకు న్యాయం చేసి పోలీసు శాఖకు మంచి పేరు తీసుకురావాలన్నారు. నేర ప్రవృత్తి గల వారిపై నిఘా పెట్టాలని, అనుమానితుల సమా చారాన్ని సేకరించాలని సిబ్బందికి సూచించారు. ఫిర్యాదుదారులతో మర్యాదపూర్వకంగా ప్రవర్తిస్తూ వారు ఇచ్చే ఫిర్యాదులపై తక్షణమే స్పందించాలన్నారు. డయల్ 100 కాల్స్ వచ్చిన వెంటనే తక్షణమే స్పందించి సంఘటన స్థలానికి చేరుకోవాలని ఆదేశించారు. ఆయన వెంట మెదక్ డీఎస్పీ ప్రసన్నకుమార్, మెదక్‌రూరల్ సీఐ రాజశేఖర్‌రెడ్డి, ఎస్‌ఐ మురళి, సిబ్బంది ఉన్నారు.
Comments
Please login to add a commentAdd a comment