జాతరలో ప్లాస్టిక్ కనిపించొద్దు
అదనపు కలెక్టర్ నగేష్
పాపన్నపేట(మెదక్): అధికారులు సమన్వయంతో పనిచేసి ఏడుపాయల జాతరను జయప్రదం చేయాలని అదనపు కలెక్టర్ నగేష్ పిలుపునిచ్చారు. గురువారం ఏడుపాయల్లో అధికారులతో సమీక్ష నిర్వహించారు. ఈనెల 26 నుంచి ప్రారంభమయ్యే జాతరకు సుమారు 10 లక్షలకు పైగా భక్తులు వస్తారని చెప్పారు. ఏ షాపులో ప్లాస్టిక్ కనిపించొద్దని ఆదేశించారు. ఇప్పటికే ప్లాస్టిక్ కవర్లు ఉంటే వాటిని తమకు అప్పగిస్తే బదులుగా పేపర్ కవర్లు ఇస్తామని సూచించారు. జాతర పరిసరాల్లో మరిన్ని శౌచాలయాలు ఏర్పాటు చేయాలన్నారు. పార్కింగ్ ప్రదేశాల నుంచి నడవలేని వ్యక్తుల కోసం ప్రత్యేక బస్సులు ఏర్పాటు చేయాలన్నారు. లడ్డూ, పులిహోర కేంద్రాల వద్ద ప్రత్యేక క్యూలైన్లు ఏర్పాటు చేయాలన్నారు. ట్రాఫిక్ ఇబ్బందులు తలెత్తకుండా చూడాలని చెప్పారు. ఆలయం వద్ద తొక్కిసలాట జరగకుండా పటిష్ట చర్యలు తీసుకోవాలన్నారు. ఈనెల 24 వరకు ఏర్పాట్లు పూర్తి కావాలని ఆదేశించారు. సమావేశంలో డీఎస్పీ ప్రసన్నకుమార్, డీఎల్పీఓ సురేష్ బాబు, ఈఓ చంద్రశేఖర్, వివిధశాఖల అధికారులు పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment