పంట రుణాల మంజూరులో వివక్ష
వెల్దుర్తి(తూప్రాన్): వ్యవసాయ రుణాల మంజూరులో మాసాయిపేట కెనరా బ్యాంక్ మేనేజర్ నవీన్‌రెడ్డి వివక్ష చూపుతున్నారని అఖిలపక్ష నాయకులు ఆరోపించారు. ఈ మేరకు గురువారం బ్యాంక్ మేనేజర్‌ను నిలదీశారు. నిబంధనల మేరకే సిబిల్ లేని రైతులకు రుణాలు మంజూరు చేయడం లేదని మేనేజర్ చెప్పడంతో లిఖితపూర్వకంగా రాసి ఇవ్వాలని పట్టుబట్టారు. ఈసందర్భంగా అఖిలపక్ష నాయకులు మాట్లాడుతూ.. ప్రభుత్వ రుణమాఫీ పొందిన రైతులకు తిరిగి రుణాలు చెల్లించడంలో మేనేజర్ నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారని మండిపడ్డారు. రైతుభరోసా డబ్బులను సైతం గోల్డ్ రుణాల కింద జమ చేయడంతో వ్యవసాయ పెట్టుబడికి రైతులు ఇబ్బందులు పడుతున్నారని వాపోయారు. రుణమాఫీ వర్తించిన రైతులకు తిరిగి రుణాలు రీ షెడ్యూల్ చేయడంతో పాటు రైతు భరోసా డబ్బులను ఇతర రుణాల కింద జమ చేయవద్దని ఓ వైపు ప్రభుత్వం ఆదేశిస్తున్నా, ఇవేమీ పట్టనట్లు మేనేజర్ వ్యవహరిస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. కార్యక్రమంలో కాంగ్రెస్, బీఆర్‌ఎస్, బీజేపీలకు చెందిన పలువురు నాయకులు పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment