సస్యరక్షణ చర్యలు తప్పనిసరి
కలెక్టర్ రాహుల్‌రాజ్
చిన్నశంకరంపేట(మెదక్): వ్యవసాయ అధికారులు వరి పంటలను నిత్యం క్షేత్రస్థాయిలో పరిశీలించాలని కలెక్టర్ రాహుల్‌రాజ్ ఆదేశించారు. గురువారం మండల కేంద్రంలో వరి పంటలను పరిశీలించారు. ఈసందర్భంగా రైతులతో మాట్లాడి పంటలకు సోకుతున్న తెగుళ్లపై ఆరా తీశారు. వ్యవసాయ అధికారుల సూచనల మేరకు సస్యరక్షణ చర్యలు చేపట్టాలని సూచించారు. అధికారులు సైతం నిత్యం పంట పొలాలను పరిశీలించి రైతులను అప్రమత్తం చేయాలన్నారు. జిల్లాలో అత్యధిక శాతం రైతులు వరి పంటనే సాగుచేస్తున్నారని తెలిపారు. ఈసందర్భంగా ఏఓ ప్రవీణ్‌కు పలు సూచనలు చేశారు. అనంతరం చేగుంటలోని ప్రాథమిక ఆరోగ్యకేంద్రాన్ని ఆకస్మికంగా తనిఖీ చేశారు. వానాకాలంలో ఆస్పత్రి స్లాబ్ నుంచి నీరు వస్తుందని డాక్టర్ అనిల్‌కుమార్ కలెక్టర్ దృష్టికి తీసుకెళ్లగా.. జిల్లా వైద్యాధికారితో మాట్లాడి మరమ్మతుల కోసం ప్రత్యేక నిధులు మంజూరు చేయిస్తానని హామీ ఇచ్చారు.
ఓటరు స్లిప్‌లు పంపిణీ చేయాలి
మెదక్ కలెక్టరేట్: ఎమ్మెల్సీ ఎన్నికల నేపథ్యంలో ఓటరు స్లిప్‌లు పంపిణీ చేయాలని కలెక్టర్ అధికారులను ఆదేశించారు. గురువారం హవేళిఘణాపూర్ తహసీల్దార్ సింధు రేణుక కలెక్టర్ రాహుల్‌రాజ్‌ను క్యాంపు కార్యాలయంలో కలిసి ఓటర్ స్లిప్ అందజేశారు. ఈసందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ.. ఓటర్ స్లిప్పుల పంపిణీ పూర్తయిన తర్వాత రిపోర్టు సమర్పించాలని ఆదేశించారు. పట్టభద్రులు, టీచర్లు ఈనెల 27న ఓటు హక్కు వినియోగించుకోవాలని సూచించారు.
Comments
Please login to add a commentAdd a comment