మల్లన్న హుండీ ఆదాయం రూ.78 లక్షలు
కొమురవెల్లి(సిద్దిపేట): మల్లికార్జున స్వామి హుండీ ఆదాయం రూ.78 లక్షలు వచ్చినట్లు ఆల య కార్యనిర్వహణ అధికారి రామాంజనేయులు తెలిపారు. గురువారం ఆలయ ముఖ మండపంలో హుండీలలోని కానుకలను లెక్కించారు. 19 రోజులలో నగదు రూ.78,31,047, విదేశి కరెన్సీ నోట్లు 130, మిశ్రమ బంగారం 82 గ్రాములు, మిశ్రమ వెండి 5 కిలోల 100 గ్రాములు, పసుపు బియ్యం13 క్వింటాళ్లు వచ్చినట్లు ఆయన చెప్పారు. కార్యక్రమంలో ఆలయ ప్రధానార్చకులు మహదేవుని మల్లికార్జున్ ఆలయ ధర్మకర్తలు, లలిత సేవా సమితి సభ్యులు పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment