
బాలికలు అన్నిరంగాల్లో రాణించాలి
చిన్నశంకరంపేట(మెదక్): బాలికలు అన్నిరంగాల్లో రాణించాలని జిల్లా మహిళా, శిశు సంక్షేమ శాఖ అధికారిణి హైమావతి అన్నారు. శుక్రవారం మండలంలోని చందంపేట జెడ్పీ పాఠశాలలో బేటీ బచావో.. బేటీ పడావో కార్యక్రమంలో పాల్గొని మాట్లాడారు. అమ్మాయిలను చదివించడంతో పాటు 18 ఏళ్లు నిండిన తర్వాతే పెళ్లి చేయాలని తల్లిదండ్రులకు సూచించారు. బాల్య వివాహాలు చేస్తే 1098కు ఫోన్ చేసి సమాచారం అందించాలని కోరారు. ఎలాంటి విపత్కర పరిస్థితి ఎదురైనా ధైర్యంగా 100కు డయల్ చేసి రక్షణ పొందాలని తెలిపారు. ఈసందర్భంగా బాలికల చేత మొక్కలు నాటించారు. కార్యక్రమంలో అధికారులు సంతోషి, నాగమణి, కవిత, రమేష్, హెచ్‌ఎం శ్రీనివాస్‌గౌడ్ తదితరులు పాల్గొన్నారు.
డీడబ్ల్యూఓ హైమావతి
Comments
Please login to add a commentAdd a comment