
జాతర నిధులకు ఎన్నికల కోడ్!
పాపన్నపేట(మెదక్): ఏడుపాయల జాతర నిధులకు ఎమ్మెల్సీ ఎన్నికల కోడ్ అడ్డంకిగా మారనుంది. మహాశిరాత్రి సందర్భంగా ఈనెల 26వ తేదీ నుంచి మూడు రోజుల పాటు మహాజాతర జరుగనుంది. తెలంగాణలోనే ప్రసిద్ధి చెందిన ఏడుపాయల జాతరకు సుమారు 15 లక్షల మంది భక్తులు తరలివస్తారు. రాష్ట్ర ఏర్పాటు తర్వాత 2014 నుంచి ప్రభుత్వం జాతరలో భక్తులకు కనీస సౌకర్యాలు కల్పించేందుకు ఏటా రూ. 2 కోట్ల నిధులు విడుదల చేస్తుంది. ఈ ఏడాది సైతం నిధుల విడుదల కోసం కలెక్టర్ రాహుల్‌రాజ్ ప్రభుత్వానికి ప్రతిపాదనలు పంపారు. కానీ ఎమ్మెల్సీ ఎన్నికల కోడ్ అమలులో ఉన్న నేపథ్యంలో నిధులు విడుదలయ్యే అవకాశం కనిపించడం లేదు. అయితే ప్రస్తుతం స్పెషల్ డెవలప్‌మెంట్ ఫండ్ నుంచి సీసీ రోడ్లు వేస్తున్నట్లు ఈఓ చంద్రశేఖర్ తెలిపారు. నాయకులు, డిపార్ట్‌మెంట్ అధికారులు మాత్రం గతేడాది లాగే పనులు ప్రారంభించారు.
Comments
Please login to add a commentAdd a comment