హెల్మెట్ లేకుంటే నో ఎంట్రీ
మెదక్ కలెక్టరేట్: కలెక్టరేట్‌లోకి వచ్చే వాహనదారులు హెల్మెట్ ధరించాల్సిందేనని హవేళిఘణాపూర్ ఎస్‌ఐ సత్యనారాయణ అన్నారు. శుక్రవారం కలెక్టరేట్ ప్రధాన గేటు వద్ద సిబ్బందితో కలిసి వాహనాల తనిఖీ చేపట్టారు. ఈసందర్భంగా హెల్మెట్ లేకుండా కలెక్టరేట్‌లోకి వచ్చిన 12 మంది వాహనదారులకు జరిమానా విధించి కౌన్సెలింగ్ నిర్వహించారు. రోజు రోజుకు పెరుగుతున్న రోడ్డు ప్రమాద మరణాలను నివారించేందుకు కలెక్టర్ ప్రత్యేక చొరవ తీసుకున్నారని తెలిపారు. ఉద్యోగులు, ఇతర వాహనదారులు తప్పనిసరిగా హెల్మెట్ ధరించాలని చెప్పారు. అలాగే వాహన పత్రాలు, డ్రైవింగ్ లైసెన్స్ తప్పనిసరిగా ఉండాలన్నారు.
Comments
Please login to add a commentAdd a comment