అప్పుల పాలయ్యాం.. ఆదుకోండి
శివ్వంపేట(నర్సాపూర్): పంచాయతీలలో సొంత డబ్బులతో పనులు చేయించి అప్పుల పాలయ్యామని.. డబ్బులు ఇప్పించాలని కోరుతూ ఎంపీడీఓకు పంచాయతీ కార్యదర్శులు శుక్రవారం వినతిపత్రం అందజేశారు. ఈసందర్భంగా వారు మాట్లాడుతూ.. ఏడాదికాలంగా పంచాయతీలకు నిధులు లేకపోవడంతో సొంత డబ్బులు ఖర్చు చేసి పనులు చేయిస్తున్నామని ఆవేదన వ్యక్తం చేశారు. వేతనాలు సరిపోకపోవడంతో అప్పులు చేశామని వాపోయారు. గ్రామాల్లో ట్రాక్టర్ డీజిల్, పారిశుద్ధ్య పనులు, బోరు మరమ్మతులు, వీధి దీపాల నిర్వహణ తదితర.. ఖర్చులకు డబ్బులు లేవన్నారు. ప్రభుత్వం స్పందించి మా డబ్బులు చెల్లించాలని కోరారు.
Comments
Please login to add a commentAdd a comment