
సకాలంలో మందులు సరఫరా చేయండి
కలెక్టర్ రాహుల్‌రాజ్
మెదక్ కలెక్టరేట్: జిల్లాలోని అన్ని ఆరోగ్య కేంద్రాలకు సకాలంలో మందులు సరఫరా చేయాలని, ఎక్కడా ఇబ్బందులు తలెత్తకూడదని కలెక్టర్ రాహుల్‌రాజ్ సిబ్బందిని ఆదేశించారు. శుక్రవారం జిల్లా కేంద్రంలోని డ్రగ్ స్టోర్‌తో పాటు ప్రభుత్వ ఆస్పత్రిని ఆకస్మికంగా తనిఖీ చేశారు. జిల్లాలో వైద్య సేవలు ప్రణాళికాబద్ధంగా విస్తృతపర్చాలని, అన్ని వ్యాధులకు సంబంధించిన మందులు నిల్వ ఉంచుకోవాలని సూచించారు. జిల్లాలోని అన్ని పీహెచ్‌సీల్లో వందశాతం ఇమ్యునైజేషన్ సేవలు అందించాలన్నారు. అనంతరం మెదక్ ఏరియా ఆస్పత్రిలో వ్యాధి నిరోధక టీకాల నిల్వ గది, డెంటల్ విభాగం, ఫిజియోథెరఫీ, కంటి పరీక్ష సెంటర్లను పరిశీలించారు. ఈసందర్భంగా కలెక్టర్ స్వయంగా కంటి పరీక్ష చేయించుకున్నారు. అలాగే డిప్యూటీ కార్యాలయాన్ని పరిశీలించి సీసీ కెమెరాలు ఏర్పాటు చేయాలని సంబంధిత అధికారులు ఆదేశించారు.
ఏఐ పైలెట్ ప్రాజెక్ట్‌గా మెదక్
ఏఐ పైలెట్ ప్రాజెక్టుగా మెదక్ జిల్లా ఎంపికై నట్లు కలెక్టర్ రాహుల్‌రాజ్ తెలిపారు. శుక్రవారం రాత్రి రాష్ట్ర విద్యాశాఖ కార్యదర్శి యోగితారానా హైదరాబాద్ నుంచి నిర్వహించిన జూమ్ మీటింగ్‌లో డీఈఓ రాధాకిషన్‌తో కలిసి పాల్గొన్నారు. కృత్రిమ మేధా, ఏఐని జిల్లాలోని ఆరు మండల పరిషత్ పాఠశాలల్లో అమలు చేయనున్నట్లు తెలిపారు. అనంతరం పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికలపై రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి సుదర్శన్‌రెడ్డి నిర్వహించిన వీడియో కాన్ఫరెన్స్‌లో ఎస్పీ ఉదయ్‌కుమార్‌రెడ్డి, అదనపు కలెక్టర్ నగేష్‌తో కలిసి పాల్గొన్నారు. ఇప్పటికే ఎన్నికలకు సంబంధించి అన్ని ఏర్పాట్లు పూర్తి చేశామని కలెక్టర్ వివరించారు.
Comments
Please login to add a commentAdd a comment